Begin typing your search above and press return to search.
గాంధీ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్!
By: Tupaki Desk | 29 April 2020 6:30 AM GMTతెలంగాణ లో గత నాలుగు రోజులు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన నియమాల వల్లే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుతూ వస్తుంది అని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఇక తాజాగా కరోనా పేషేంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్న గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి కి కరోనా వ్యాధి సోకినట్లు అధికారులు ధృవీకరించారు అని ,అత్తగారిల్లు బయ్యారం కావడంతో తన భార్య, పిల్లలతో అక్కడే ఉన్నాడు అని, అయితే ఆ వ్యక్తి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది అని, దీనితో అతని భార్య, పిల్లలతో పాటు అత్తామామలను కూడా అధికారులు బయ్యారంలో హోమ్ క్వారెంటైన్ లో ఉంచారు అని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. దీని పై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, తెలంగాణ లో మంగళవారం మరో ఆరుగరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఈ కేసులన్నీ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1009కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 1009కు చేరింది. వైరస్ బారిన పడినవారిలో 42మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 374మంది డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు. తెలంగాణలో 50శాతం కరోనా కేసులు జీహెచ్ ఎం సీ పరిధిలోనే ఉన్నాయి.
మరోవైపు ఏపీలో 1259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇప్పటివరకు 31మంది మరణించారు. 970 కేసులు ప్రస్తుతం యాక్టివ్ లో ఉన్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా 31,332కు కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 1007మంది మరణించారు. 22629 కేసులు ప్రస్తుతం యాక్టివ్ లో ఉన్నాయి.