Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం...తల్లీబిడ్డలకు కరోనా !

By:  Tupaki Desk   |   2 April 2020 11:10 AM GMT
బ్రేకింగ్ : ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం...తల్లీబిడ్డలకు కరోనా !
X
కరోనా వైరస్ .. కరోనా వైరస్ .. ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. ఈ మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి లో అలజడి మొదలైంది. అయితే , ఈ అత్యంత భయంకరమైన వైరస్ ఒకవైపు ప్రజల ప్రాణాలని అపహరిస్తున్న కూడా..డాక్టర్లు మాత్రం కరోనా పై యుద్ధం ప్రకటించి, కరోనా సోకిన వారికీ తమ ప్రాణాలని పనంగా పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే.. వారి సేవలు కొనియాడదగినవే. అయితే కొందరి అలసత్వం మాత్రం కరోనా వ్యాప్తికి కారణం అవుతుంది.

తాజాగా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజుల పసిబిడ్డకు, బిడ్డ తల్లికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషాద ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు చూస్తే ..ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతి మార్చి 26వ తేదీన ఇంటివద్దే ఓ బిడ్డకు జన‍్మని ఇచ్చింది. పసిబిడ్డ పరిస్థితి బాగోలేకపోవటం తో ఆమె భర్త తల్లీబిడ్డలను చెంబూర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ సరైన చికిత్స అందటం లేదన్న కారణం తో కుర్లా బాబా ఆసుపత్రికి మార్చాడు.

ఆ ఆసుపత్రిలోనూ అదే పరిస్థితి ఎదురుకావటం తో అక్కడినుంచి కస్తూర్భా ఆసుపత్రికి వారిని తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డలలో కరోనా లక్షణాలను గుర్తించి పరీక్షలు నిర్వహించగా ..ఆ తల్లి , బిడ్డకి కరోనా నిర్దారణ పాజిటివ్ అని తేలింది. కాగా, చెంబూర్‌ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలకు వైరస్‌ సోకిందని, వారిని కరోనా పేషంట్‌ బెడ్‌ మీద ఉంచటమే ఇందుకు కారణమని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనితో ఇప్పటికే కరోనా సోకిన వారు ప్రాణాల తో పోరాడుతుంటే ..ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు తల్లీబిడ్డకు కరోనా సోకింది.