Begin typing your search above and press return to search.
సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 28 Dec 2021 5:32 AM GMTబీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం అతడు కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అయితే కోవిడ్ పాజిటివ్ గా తేలినప్పటికీ అతడిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కాగా సోమవారం గంగూలీకి స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న దాదా అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా గంగూలీ అనారోగ్యంతో ఇలా ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాది మూడోసారి. సౌరవ్ కు ఇటీవలే గుండె శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గుండె నాళాలు మూసుకుపోవడంతో వైద్యులు ఒక స్టెంట్ వేశారు. జనవరి 2న గంగూలీ వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి రావడంతో వుడ్ ల్యాండ్ ఆస్పత్రికి తరలించి స్టంట్లు వేశారు. యాంజియోప్లాస్టీ చేశారు. మూడు బ్లాక్ లను గుర్తించి చికిత్స అందించారు. అడ్డంకిని తొలగించడానికి ఒకదానిలో ఒక స్టెంట్ వేశారు.
కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. మరోసారి 20 రోజులకే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్సలో భాగంగా యాంజియో ప్లాస్టీ సర్జరీ చేయించుకున్నాడు. రక్తనాళాలు బ్లాక్ కావడంతో రెండు స్టెంట్లు కూడా వేయించుకున్నారు. గతంలో గంగూలీ సోదరుడు.. తల్లి కరోనా బారినపడ్డారు.