Begin typing your search above and press return to search.
తబ్లీగ్ జమాత్ కేసు విచారణ..ఇద్దరు పోలీసులకు కరోనా!
By: Tupaki Desk | 2 May 2020 9:10 AM GMTతబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై నమోదు చేసిన కేసు దర్యాప్తు చేస్తున్న ఇద్దరు పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ కేంద్రంగా తబ్లీగ్ జమాత్ సమావేశాలు నిర్వహించి దేశంలో కరోనా ప్రబలేందుకు కారణమయ్యారని మౌలానా సాద్ పై ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశంలో ఒకరకంగా కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజృంభించడానికి ప్రధాన కారణం ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటనే కారణం. అప్పుడప్పుడే దేశంలో కరోనా కంట్రోల్ లోకి వస్తుంది అని అనుకుంటున్న సమయంలో ఈ మర్కజ్ ఘటన వెలుగులోకి రావడం ...ఆ తరువాత అన్ని రాష్ట్రాలలో కరోనా భాదితులు ఒక్కసారిగా పెరిగిపోవడం చకచకా జరిగిపోయింది. ఇప్పటికి కూడా మర్కజ్ మూలాలు బయట పడుతున్నాయి. దీని పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు పోలీసులు తబ్లీగ్ జమాత్ చీఫ్ ఫాం హౌస్ తోపాటు మర్కజ్ ను సందర్శించారు. ఇద్దరు పోలీసులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని పరీక్షించగా కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసు క్రైంబ్రాంచ్ బృందంలోని మరో 12 మందిని హోంక్వారంటైన్ కు తరలించారు. దేశ రాజధాని లో కరోనా వచ్చిన పోలీసుల సంఖ్య ఇప్పటికే వంద దాటి పోయింది.