Begin typing your search above and press return to search.
ట్రంప్ కు కరోనా పాజిటివ్!
By: Tupaki Desk | 4 July 2020 10:30 AM GMTఅమెరికా అల్లకల్లోలంగా ఉంది. జూలై 4 అయిన నేడు ఆ దేశ స్వాతంత్ర్యం దినోత్సవం. ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్ లో సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. ప్రజలంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వీకెండ్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
అమెరికాలో మొన్న ఒక్కరోజు 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 40,000 కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఈ సంఖ్య 52,000 కన్నా ఎక్కువ. దేశంలో 2.7 మిలియన్ల మందికి ఇది సోకింది. 36 రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఫ్లోరిడాలో అత్యధికంగా అన్నిఇతర రాష్ట్రాలకన్నా రోజుకు 7000 కొత్త కేసులను నమోదు చేస్తోంది.
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ స్నేహితురాలు కింబర్లీ గుయిల్ ఫాయల్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది.
గతంలో ఫ్యాక్స్ న్యూస్లో పనిచేసిన కింబర్లీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో ప్రస్తుతం సీనియర్ ఫండ్ రైజర్ గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ అంతరంగికుల్లో ఒకరైన కింబర్లీ తాజాగా కరోనా బారినపడడంతో అమెరికా అధ్యక్షుడి దరికి కూడా కరోనా వచ్చినట్టైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో దక్షిణ డకోటాలో ఒక సభలో కింబర్లీ పాల్గొనాల్సి ఉంది. అయితే ఆమెకు పాజిటివ్ గా తేలడంతో సభకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు ఆమెలో కనిపించడం లేదని చికిత్స పొందుతోందని తెలిసింది.
ట్రంప్, ఆయన కొడుకు జూనియర్ ట్రంప్ లు కింబర్లీకి పాజిటివ్ అని తెలియగానే షాక్ కు గురైనట్టు తెలిసింది. కింబర్లీతో తిరిగిన ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ కు కరోనా సోకి ఉంటుందన్న అనుమానాలు అమెరికన్ మీడియాలో సాగుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.