Begin typing your search above and press return to search.

దేశంలో భారీగా పెరిగిన కరోనా రికవరీ రేటు ..ఎంతంటే ?

By:  Tupaki Desk   |   18 Nov 2020 1:10 PM GMT
దేశంలో భారీగా పెరిగిన కరోనా రికవరీ రేటు ..ఎంతంటే ?
X
దేశంలో రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు ప్రకటించి కరోనా హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. ప్రస్తుతం భారత కరోనా రికవరీ రేటు 93.52 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది ఓ శుభపరిణామమే అని చెప్పాలి. అయితే , కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా విజృంభణ పెరుగుతుండటం ఆందోళనకర అంశం అని చెప్పాలి. ఇదిలా ఉంటే .. దేశంలో గతకొన్ని రోజులుగా ప్రతిరోజూ కూడా వేల సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా కూడా , ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం శుభపరిణామం.

ఇకపోతే , దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,617 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ మొత్తం కేసుల సంఖ్య 89,12,908కి చేరింది. అలాగే ,‌ ఆసుపత్రుల్లో 4,46,805 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 83,35,110 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నిన్న దేశవ్యాప్తంగా 474 మంది మృతి చెండంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,30,993 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 44,739 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 5.01 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.47 శాతానికి తగ్గింది.