Begin typing your search above and press return to search.
భారత్ లో మళ్లీ మొదలైన కరోనా జోరు ..... @ 90 లక్షల కేసులు !
By: Tupaki Desk | 20 Nov 2020 8:30 AM GMTభారత్ లో కరోనా మహమ్మారి జోరు మళ్లీ మొదలైనట్టు తెలుస్తుంది. గతంలో కొన్ని రోజులపాటు కరోనా పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు అవ్వగా , తాజాగా ఆ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూపోతుంది. గతంలో ముప్పై వేలకి దిగువగా రాగా , ప్రస్తుతం ఆ సంఖ్య 40 వేలు దాటిపోయింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షల మార్కును దాటేసింది. కేవలం 22 రోజుల్లోనే పది లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. కేసుల పరంగా అమెరికా తరవాత భారత్ రెండో స్థానంలో ఉంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 45,882 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే, క్రియాశీల కేసులు ఐదు శాతానికి దిగువన ఉండటం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,43,794గా ఉండగా.. ఆ కేసుల రేటు 4.93 శాతానికి తగ్గింది. అలాగే రికవరీల సంఖ్య 84,28,409 గా ఉంది. ఈ మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 584 మంది మరణించారు దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,32,162కి చేరింది. నిన్న ఒక్కరోజే 10,83,397 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.