Begin typing your search above and press return to search.

ముగిసిన తెలంగాణలో కరోనా ఆంక్షల గడువు..: పొడగింపు లేనట్లేనా..?

By:  Tupaki Desk   |   1 Feb 2022 11:30 AM GMT
ముగిసిన తెలంగాణలో కరోనా ఆంక్షల గడువు..: పొడగింపు లేనట్లేనా..?
X
కరోనా కేసులు కాస్త అటూ ఇటుగా నమోదవుతున్నాయి. ఒకరోజు తగ్గినా.. మరోరోజు విజృంభిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వాలు మాస్క్ తప్పనిసరి చేసింది. కానీ ఆంక్షల విషయంలో కఠినంగా లేదనే తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం థర్డ్ వేవ్ నేపథ్యంలో జనవరి 31 వరకు ఆంక్షలు విధించింది. అయితే గతంలో ఆంక్షల గడువు ముగిసే ముందే ఏదో ఒక నిర్ణయం తీసుకునేంది. కానీ ఈసారి ఆ విషయంపై పెద్దగా దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. ఇక నేటి నుంచి విద్యాసంస్థలన్నీ తెరుచుకున్నాయి. శానిటైజర్, మాస్క్ లు తప్పని సరి అని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఆయితే ఆంక్షలు పొడగింపుపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఇక రాష్ట్రంలో ఆంక్షలు సడలించినట్లేనా..? అన్న చర్చ సాగుతోంది.

కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో కేసులు భారీగా పెరిగాయి. జనవరి ప్రారంభ నుంచి అంతకంతకు పెరుగుతూ ప్రతిరోజూ 2 వేలకు పైగానే నమోదవుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఉత్తరాన కేసులు తగ్గుముఖం పడిన నేపథ్యంలో దక్షిణాదిన పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఫిబ్రవరి మొదటి వారంలో కేసులు పతాక స్థాయికి పెరిగి ఆ తరువాత తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఇప్పటికే తెలిపారు. కేసులు పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే కేసులు పెరుగుతున్నా రికవరీ సంఖ్య కూడా పెరుగుతుండడంతో కాస్త ఊరట నిస్తోంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘జ్వర సర్వే’ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పరీక్షించి లక్షణాలుంటే అక్కడే కరోనా కిట్ ను అందించే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో లక్షణాలు మొదలైన వారు ఈ కరోనా కిట్ ను ఉపయోగించుకొని తీవ్రత తగ్గించుకున్నారు. దీంతో మొత్తంగా కేసులు పెరుగుతూ తగ్గున్నట్లు తెలుస్తోంది. సోమవారం 81,486 పరీక్షలు నిర్వహించగా 2,800 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 746 కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 234, రంగారెడ్డి జిల్లాలో 165, ఖమ్మం జిల్లాలో 130,నల్గొండ జిల్లాలో 104 కేసులు నమోదయ్యాయి.

అంతకుముందు కంటే కరోనా విషయంలో ప్రజల్లోనూ కాస్త క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలు గుర్తించి వెంటనే సరైన ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు టెస్టులు చేయించుకోవడానికి భారీగా క్యూ కడుతున్నారు. దీంతో ట్రేసింగ్ ఎక్కువ కావడంతో స్ప్రెడ్డింగ్ కంట్రోల్ అవుతుందని అంటున్నారు. దీంతో పాటు ఫీవర్ సర్వే ద్వారా వైద్య సిబ్బంది మెడిసిన్ అందించడంతో పాటు తగు సూచనలు అందించడంతో కేసులు భారీగా పెరగడం లేదని అంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వం జనవరి 31 వరకు కరోనా ఆంక్షలనువిధించింది. అయితే మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. ఇక బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధాన్ని విధించింది. మత సంబంధిత కార్యక్రమాలకు అనుమతిని నిరాకరించింది. అయితే వీటిపై మరోసారి పొడిగించినట్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆంక్షలు సడలించినట్లేనా..? అని అనుకుంటున్నారు.