Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కరోనా దందా ..రూ. 5వేలు వ్యాక్సిన్ రూ.30వేలకు ..!

By:  Tupaki Desk   |   21 July 2020 10:30 AM GMT
హైదరాబాద్ లో కరోనా దందా ..రూ.  5వేలు వ్యాక్సిన్ రూ.30వేలకు ..!
X
కరోనా మహమ్మారి విజృంభనతో ప్రజలందరూ భయంతో వణికిపోతుంటే ..ఆ భయాన్ని కొందరు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం కరోనా దేశంలో విలయతాండవం చేస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు .. కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను అక్రమంగా అధిక ధరలకు అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ డ్రగ్ దందాకి పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. రోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించి అధిక ధరకు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజ్ గిరి లో ఎస్వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

ముఖ్యంగా ప్రస్తుతం కరోనా చికిత్సకి ఉపయోగించి ఫెవిఫిరావిర్ ట్యాబ్లెట్లు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను రూ.30వేల చొప్పున ఎక్కవ ధరకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. మార్కెట్ లో రెమ్ డెసివిర్ ఒక్క ఇంజెక్షన్ ధర రూ.5, 500 మాత్రమే. కానీ ,ఈ కేటుగాళ్లు వేలల్లో అమ్ముతూ భాదితుల భయాన్ని క్యాష్ చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. వారి నుంచి ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

కరోనా చికిత్సలో ఫెవిఫిరావిర్ ట్యాబ్లెట్లు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కువగా వాడుతున్నారు. దీనితో మార్కెట్ లో ఆ డ్రగ్ కి బాగా డిమాండ్ ఏర్పడింది. దీనితో ఆ డిమాండ్ ను తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆ డ్రగ్స్ ని మర్కెట్స్ లో కుత్రిమ కొరత సృష్టించి కరోనా యాంటీ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. అయితే ,ఇంకొ దారి లేకపోవడంతో కొందరు వ్యక్తులు వారి చెప్పిన ధరకే కొంటున్నారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ లో జోరుగా ఆక్సిజన్ సిలిండర్ల దండా నడుస్తోంది. ఈ దందాలపై పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నప్పటికీ ఈ కేటుగాళ్లు రోజుకొక విదంగా రూపాంతరం చెందుతూ దందా ను కొనసాగిస్తున్నారు.