Begin typing your search above and press return to search.

కరోనా సెకండ్ వేవ్ : సెలబ్రిటీలే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారే !

By:  Tupaki Desk   |   20 April 2021 10:44 AM GMT
కరోనా సెకండ్ వేవ్ : సెలబ్రిటీలే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారే !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఊహించని రీతిలో, శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. గత నెల రోజుల కిందట ఉన్న పరిస్థితి దేశంలో ఇప్పుడు లేదు. కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రలో మొదలై యూపీ , గుజరాత్ రాష్ట్రాలలో వ్యాప్తి చెంది , నెమ్మదిగా దేశం మొత్తం పాకింది. ఆ తర్వాత ఒక్కసారిగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కరోజులోనే రెండున్నర లక్షలకి పైగా కేసులు వస్తున్నాయి అంటేనే దేశంలో కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే .. గత ఏడాది కరోనా వేవ్ కి , ఈ సెకండ్ వేవ్ కి పెద్దగా తేడా ఏమి లేదు. కానీ, ఈ సెకండ్ వేవ్ లో ఎక్కువమంది సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కరోనా చేతుల్లో చిక్కిపోతున్నారు.

ఇప్పటికే దేశంలోని ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా భారిన పడ్డారు. వారిలో కొందరు ఇప్పటికే కరోనా మహమ్మారి నుండి కోలుకోగా , మరికొందరు కరోనా కి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే భారత్ మాజీ ప్రధాని కూడా కరోనా బారిన పడ్డారు. దేశంలో కరోనా విజృభిస్తోంది. సామాన్యులతో పాటు ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది.కర్నాటక సీఎం యడ్యూరప్ప కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కర్ణాటక సీఎం రెండోసారి కరోనా బారిన పడటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కేరళ సీఎం విజయన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం ఎయిమ్స్’లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే .. తాజాగా జాతీయ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. తనకు కరోనా పాజిటివ్ అని స్వయంగా రాహుల్ గాందీ తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారని రాహుల్ గాంధీ తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను నేరుగా కలుసుకున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు చేయించుకోవాలని సూచించారు. నిన్న మాజీ ప్రధాని మన్మోసింగ్ సైతం కరోనా బారిన పడ్డారు. మరుసటిరోజే కాంగ్రెస్ నేత రాహుల్‌కు పాజిటివ్ వార్త కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ కూడా ఇప్పటికే ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయన భార్య కి ఈ రోజు ఉదయం కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీనితో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అయన ఐసొలేట్ అయ్యారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురు ఆమ్ అద్మీ పార్టీ నేతలు కరోనా బారినపడ్డారు. అలాగే మరో కేంద్ర మంత్రికి వైరస్ నిర్దారణ అయ్యింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, వైరస్ సోకినట్టు తేలిందని వివరించారు. ఇటీవల తనను ఎవరైనా కలిసుంటే వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని జితేంద్ర సింగ్ సూచించారు. మొత్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో దేశంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా మొదటి వేవ్ లో చాలా తక్కువమంది సెలబ్రిటీలు కరోనా భారిన పడ్డారు. కానీ, ఈ సెకండ్ వేవ్ లో ఎక్కువగా సినీ స్టార్స్ , ప్రముఖులు , రాజకీయ కీలక నేతలే ఎక్కువగా కరోనా భారిన పడుతున్నారు.