Begin typing your search above and press return to search.

కరోనా సెకండ్ వేవ్ః కొత్త రూల్స్ ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

By:  Tupaki Desk   |   18 March 2021 3:06 PM GMT
కరోనా సెకండ్ వేవ్ః కొత్త రూల్స్ ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!
X
త‌గ్గ‌ముఖం ప‌ట్టింద‌నుకుంటున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. కొంత కాలంగా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని ఆదేశాలు జారీచేసింది. ఈ మేర‌కు నిన్న రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడిన న‌రేంద్ర మోడీ.. ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ మేర‌క ఏపీ స‌ర్కారు నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేసింది. అవ‌కాశం ఉన్న సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు చేయాల‌ని సూచించింది. ఫ్యాక్ట‌రీలు, వాణిజ్య స‌ముదాయాల్లో శానిటైజేష‌న్ ప్ర‌క్రియ స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశించింది.
ఇక‌, జ‌నాలు ఎక్కువ‌గా సంద‌ర్శించే షాపింగ్ మాల్స్‌, అన్ని ర‌కాల మార్కెట్లలో భౌతిక దూరం పాటించాల‌ని, జ‌నాలు తప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని సూచించింది. క్యాంటీన్లు, హోట‌ళ్ల‌ను ప్ర‌తీ రెండు గంట‌ల‌కు ఒక‌సారి శానిటైజ్ చేయాల‌ని ఆదేశించింది. ఈ నిబంధ‌న‌లు ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా పాటించాల‌ని, త‌ద్వారా క‌రోనా నియంత్ర‌ణ‌కు స‌హ‌కరించాల‌ని కోరింది.