Begin typing your search above and press return to search.
కొవిడ్ సెకండ్ వేవ్: అమెరికాను మించి భారత్.. త్వరలో అది కూడా!
By: Tupaki Desk | 5 April 2021 3:45 AM GMTకరోనా మాహమ్మారి ప్రపంచాలను ఇంకా వణికిస్తూనే ఉంది. అగ్రరాజ్యం చిన్న దేశం అనే తేడా లేకుండా ఈ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మార్చి నెల నుంచి బాధితుల సంఖ్య అన్నిదేశాల్లో క్రమంగా పెరుగుతోంది. కాగా దేశం ప్రస్తుతం రెండో దశ గుప్పిట్లో ఉందని... రానున్న రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. తాజాగా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య ప్రస్తుతం కలవరపెడుతున్నాయి.
దేశంలో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికీ భారత్లో సగటున రోజూ 68,969 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవి అమెరికాలో 65,753 కాగా బ్రెజిల్లో 75,151 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం భారత్ అమెరికాను మించినట్లు తెలుస్తోంది. ఇకపోతే త్వరలో బ్రెజిల్ను అధిగమిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో వైరస్ వ్యాప్తి 0.87 శాతం ఉండగా.. ఇది భారత్లో 4.24 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
రెండో దశ క్రమంగా వేళ్లూనుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రెండో దశలో భాగంగా భారత్లో త్వరలో కేసులు మరింతగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు రోజుకు లక్ష మంది వైరస్ బారిన పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కాగా వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ ఉండగా ప్రస్తుతం భారత్ ఆ జాబితాలోకి చేరిందని అంటున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు పక్కాగా పాటించాలని లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.
భారత్లో కరోనాపై చాలామందికి అవగాహన లేదని... అందుకే మాస్క్లు, భౌతిక దూరం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం అవగాహన కల్పించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందరూ విధిగా కరోనా నిబంధనలు పాటిస్తే మహమ్మారికి కాస్తైనా అడ్డుకట్టవేయగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.