Begin typing your search above and press return to search.
ఛీ..ఛీ.. ఇంత చెత్త రికార్డా? ప్రపంచ కేసుల్లో 41%..మరణాల్లో 17%
By: Tupaki Desk | 24 April 2021 11:30 AM GMTక్యాలెండర్ లో రోజు గడిచే సరికి.. అప్పటివరకు ఉన్న చెత్త రికార్డులు చెరిగిపోయి.. కొత్తవి నమోదవుతున్నాయి. అయితే.. అవన్నీ భారతదేశం పేరుతో ఉండటం మనసును కష్టపెట్టేదిగా ఉంటోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న రెండో దేశమైన భారత్ ఈ రోజు కరోనా కోరలకు చిక్కి విలవిలలాడిపోతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. గత నెలలో ఇదే సమయానికి.. ఉన్న కేసులకు.. తాజాగా నమోదవుతున్నకేసులకు పొంతనే లేదు. కలలో కూడా ఊహించనంత వేగంగా పెరుగుతున్న కేసులు ఒకవైపు.. వారందరికి వైద్య సాయం అందించలేక తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతోంది దేశంలోని వైద్య వ్యవస్థ.
తాజాగా 3.32లక్షల కేసులు ఒక్కరోజులో నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 8.13లక్షల కేసులు నమోదు అయితే.. అందులో 41 శాతం కేసులు ఒక్క భారత్ లోనే చోటు చేసుకుంటున్నాయి. అది కూడా అధికారిక లెక్కల ప్రకారం చూసినప్పుడు. అనధికారికంగా భారత్ లో నమోదవుతున్న కేసులు మరింతగా ఉంటాయని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్ని సగానికి సగం తగ్గించి చూపిస్తున్నారన్న ఆరోపణలు.. విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికే దీనికి సంబంధించిన పలు కథనాలు గణాంకాల్ని చూపిస్తూ..లాజికల్ వాదనను వినిపిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టటం తెలిసిందే. అలాంటి వాదనను లెక్కల్లోకి తీసుకుంటే.. ప్రపంచంలో నమోదయ్యే కేసుల్లో 50-60 శాతానికి మధ్యలోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. భారత్ తర్వాత అత్యధిక కేసులు నమోదువుతున్న దేశంగా అమెరికా నిలిచింది. ఆ దేశంలో రోజులో 65,920 కేసులు నమోదైనట్లుగా వెల్లడైంది. మూడోస్థానంలో బ్రెజిల్ నిలిచింది. ఆ దేశంలో 49,314 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 8.13లక్షల కేసులు నమోదయ్యాయి.
మొదటి స్థానంలో నిలిచిన భారత్ కు.. రెండోస్థానంలో నిలిచిన అమెరికాకు మధ్య కేసుల వ్యత్యాసమే 2.64లక్షల కేసుల తేడా ఉండటం చూస్తే.. మన దేశంలో కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక.. మరణాల విషయానికి వస్తే.. మిగిలిన దేశాలతో మెరుగ్గా ఉందనే చెప్పాలి. కాకుంటే.. మొత్తం రోజువారీ మరణాల్లో భారత్ వాటా 17 శాతం ఉండటం ఆందోళన కలిగించేదే. శుక్రవారం ఒక్కరోజున భారత్ లో చోటు చేసుకున్న మరణాలు అధికారిక లెక్కల ప్రకారం 2263. ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజులో నమోదైన మరణాలు 13,064. అయితే.. మరణాల విషయంలోనూ దేశంలోని పలు రాష్ట్రాలు చూపించే లెక్కలకు వాస్తవానికి పొంతన లేదని.. నిండిపోయిన శవాగారాలు.. శ్మశానవాటికలే నిదర్శనంగా చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు.. కరోనాకు భారత్ ప్రొడక్షన్ హౌస్ గా మారిందా? అన్న సందేహం కలుగక మానదు.