Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ : యూపీ లో స్కూళ్లు క్లోజ్ .. యోగి సర్కార్ కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   23 March 2021 5:54 AM GMT
సెకండ్ వేవ్ : యూపీ లో స్కూళ్లు క్లోజ్ .. యోగి సర్కార్ కీలక ఆదేశాలు
X
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిన మరోసారి కొనసాగుతుంది. గత న నాలుగు రోజులుగా రోజుకి 40 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మాదిరిగానే మహమ్మారి దెబ్బ ముందుగా విద్యా రంగపైనే పడింది. అసలే విద్యా సంవత్సరం కోల్పోయి, అరకొరగా పాఠాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వల్ల బడులు మళ్లీ మూతపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్కూళ్ల మూసివేత దిశగా వెళుతుండగా, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఏకంగా ఆదిశగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లో ఎనిమిదో తరగతి లోపు విద్యార్థులు ఈనెల 24 నుంచి 31 దాకా ఎవరూ స్కూళ్లకు రావొద్దని, ఆయా తరగతుల వారికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నట్లు యోగి సర్కార్ సోమవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది.

ప్రస్తుతం పరీక్షల షెడ్యూల్ లేని ఇతర విద్యా సంస్థలన్నిటినీ కూడా బుధవారం నుంచి మూసేయాలని ఆదేశించింది. అసలే విద్యా ప్రమాణాలు అంతంతమాత్రంగా ఉండే ఉత్తరప్రదేశ్ లో సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత గత నెలలోనే స్కూళ్లు తెరుచుకున్నాయి. 9, 10వ తరగతి వారికి ఆన్ లైన్ పాఠాలు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 10 నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. నెల తిరక్కముందే కరోనా మళ్లీ పెరగడంతో మూసివేత తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు. యూపీలో కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే 8,759 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6,08, 076కేసులు నమోదుకాగా, అందులో5,95,743 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,036 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసేశారు.

దేశంలో 24 గంట‌ల్లో 40,715 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 29,785 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 199 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,81,253 మంది కోలుకున్నారు. 3,45,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,84,94,594 మందికి వ్యాక్సిన్లు వేశారు.