Begin typing your search above and press return to search.

మీ ప్రాంతంలో వాయు కాలుష్యం ఉందా.. క‌రోనా వ‌చ్చిన‌ట్టే..

By:  Tupaki Desk   |   28 April 2020 5:00 AM IST
మీ ప్రాంతంలో వాయు కాలుష్యం ఉందా.. క‌రోనా వ‌చ్చిన‌ట్టే..
X
ప్ర‌స్తుతం కరోనా వైరస్ కొత్త కొత్త కోణాల్లో వ్యాపిస్తోంది. ఏ ర‌కంగా వ్యాపిస్తుందో తెలియ‌డం లేదు. కొంద‌రికి ఎలాంటి నేప‌థ్యం లేకున్నా క‌రోనా వైర‌స్ సోకి ఉండ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అంటే ప్ర‌యాణం చేయ‌డం గానీ, వైర‌స్ వ‌చ్చిన వారిని క‌ల‌వ‌డం లేదా, వారి కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, బంధువుల‌కు క‌రోనా వ‌చ్చిన దాఖ‌లాలు కూడా ఉండ‌వు. కానీ వారికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చి ఉండ‌డంతో బాధితుడితో పాటు వైద్యాధికారులు, ప్ర‌భుత్వాల‌కు సందేహం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపైనే కొన్ని సంస్థ‌లు, ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేస్తున్నారు. వైర‌స్‌కు సంబంధించిన అంశాల‌పై ప‌రిశోధ‌నలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వైర‌స్ గురించి మ‌రో షాకింగ్ న్యూస్ తెలిసింది. క‌రోనా వైర‌స్ వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంద‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. ఈ సంద‌ర్భంగా కరోనా వైరస్‌కు వాయు కాలుష్యానికి లింక్ ఉందని చెబుతున్నారు

వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నచోట్ల ఈ వైర‌స్ విజృంభిస్తోందని అధ్యయనం తేల్చింది. ఈ విష‌యాన్ని ఇటలీలోని బోలగ్న యూనివర్సిటీ, ట్రియస్టె యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేలింది. తమ ప‌రిశోధ‌న‌లో భాగంగా లంబార్డీలోని బెర్గామో పారిశ్రామిక ప్రాంతం నుంచి మూడు వారాల వ్యవధిలో సూక్ష్మ ధూళికణాల (PM 10)కు సంబంధించి 30 నమూనాలు సేకరించారు. వాటిని ప‌రిశీలించి అధ్య‌య‌నం చేశారు. భారీ స్థాయిలో ఉండే ధూళి కణాలకు కరోనా వైరస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. వారి అధ్య‌య‌నం వాస్త‌వ‌మనేలా లంబార్డీ ప్రాంతంలోనే కరోనా కేసులు అధికంగా నమోదై ఉన్నాయి. ఆ ప్రాంతంలో గాలిలో సూక్ష్మ ధూళి కణాలు (PM 10) ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. దీంతో పారిశ్రామిక ప్రాంతాల్లో అల‌జ‌డి మొద‌లైంది. క‌రోనా వైర‌స్ ఎక్క‌డ వ్యాపిస్తుందేన‌ని ఆ ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

భార‌త‌దేశంలోని ఢిల్లీలో సేమ్ లంబార్డీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులే ఉన్నాయి. ఢిల్లీలో సూక్ష్మ ధూళికణాలు (PM 10) ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. వాయు కాలుష్యంతో ఢిల్లీలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలోనూ అత్య‌ధికంగా క‌రోనా కేసులు పెరిగాయి. ఇంకా భారీ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆ క‌రోనా వైర‌స్ వ్యాప్తి వాయు కాలుష్యం కూడా ఒక కార‌ణంగా ఉండ‌డం అధికార యంత్రాంగాన్ని క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికైనా వాయు కాలుష్యంపై చ‌ర్య‌లు తీసుకుంటే కొంత క‌రోనా వైర‌స్ అదుపులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు సూచిస్తున్నారు.