Begin typing your search above and press return to search.

డేంజ‌ర్ బెల్స్‌.. ఆస్ప‌త్రుల్లోనే క‌రోనా వ్యాప్తి..

By:  Tupaki Desk   |   24 April 2020 10:10 AM GMT
డేంజ‌ర్ బెల్స్‌.. ఆస్ప‌త్రుల్లోనే క‌రోనా వ్యాప్తి..
X
కరోనా వైరస్ కొత్త కొత్త ప్రాంతాల్లో విభిన్నంగా వ్యాపిస్తోంది. ఆ వైర‌స్ నివార‌ణ కోసం ఆస్ప‌త్రుల్లో క‌రోనా బాధితుల‌ను చేర్చ‌గా ఆ ప్రాంతాల్లోనే క‌రోనా వైర‌స్ ఇత‌రుల‌కు వ్యాప్తి చెందుతోంది. దీంతో ఆస్ప‌త్రులే హాట్ స్పాట్‌ లుగా మారుతుండ‌డంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ వైర‌స్ విస్త‌ర‌ణ కేంద్రాలుగా ఆస్ప‌త్రులు మారాయి. దీంతో ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ రోగులతో పాటు వైద్యులను వదలడం లేదు. ఆ వైర‌స్ బారిన ఎక్కువ మంది వైద్యులు ప‌డ్డారు.

ఈ ప‌రిస్థితి ప్ర‌ధానంగా ఢిల్లీలో నెల‌కొంది. రాష్ట్ర ప్రభుత్వం నడిపే రోహిణిలోని బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ ఆస్పత్రిలో 21 మంది వైద్యులతో సహా 57 మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా పాజిటివ్ సోక‌డ‌మే నిద‌ర్శ‌నం. గత వారం అత్యవసర విభాగంలో అనుమానాస్పద రోగితో సంప్రదించిన తరువాత క‌రోనా పాజిటివ్ తేలింది. జ‌హంగీర్‌ పురికి చెందిన 40 ఏళ్ల మహిళను ఆస్పత్రి మెడికల్ అత్యావ‌స‌ర వార్డులో చేర్చగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇలాంటి ప‌రిస్థితే భగవాన్ మహావీర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

ఈ ఆస్ప‌త్రిలో 68 మంది సిబ్బంది క్వారంటైన్ త‌ర‌లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అనుమానాస్పద రోగికి కరోనా వైరస్ సోకిందా అని పరీక్షించారు. ఆ త‌ర్వాత సిబ్బంది తిరిగి విధుల్లోకి వచ్చారు. జహంగీర్‌ పురిలోని బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆస్పత్రిలో సిబ్బంది వారాంతంలో క‌రోనా వైర‌స్ పరీక్షలు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో 10 మంది ఆరోగ్య కార్యకర్తలు - కొంతమందిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకుండానే వారిలో కరోనా పాజిటివ్ తేలింది. ఈ నేప‌థ్యంలో సుమారు 191 మంది ఆస్ప‌త్రి సిబ్బందిని క్వారంటైన్ త‌ర‌లించాల్సి వచ్చింది.

అయితే వారిందరికి ఎక్కడ నుంచి క‌రోనా వైర‌స్ వ్యాపించిందో తెలియ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆ ప్రాంతం హాట్‌ స్పాట్‌ గా గుర్తించారు. ఆస్పత్రిలో ప‌ని చేస్తున్న చాలామంది సిబ్బంది ఈ ప్రాంతం చుట్టూ నివసిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి రోగులు కూడా ఇక్కడకు వస్తారు. లక్షణాలు లేక‌పోవ‌డంతో వారిని గుర్తించ‌డానికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. ఢిల్లీలోని 11 ప్రాంతాల‌ను హాట్‌ స్పాట్స్‌ గా కనిపిస్తున్నాయి. దేశంలోని అత్యున్నత ఆరోగ్య పరిశోధనా సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 80శాతం మందికి లక్షణాలు లేవ‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ నిపుణులతో పాటు చాలా మంది రోగులు - విదేశీ ప్రయాణ చరిత్ర లేనివారు - కొన్ని ఆస్పత్రులను సందర్శించిన వారు కూడా క‌రోనా పాజిటివ్ వచ్చినట్టు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పుడు ఆస్ప‌త్రుల‌కు వెళ్లాలంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.