Begin typing your search above and press return to search.
ఇంట్లోనే కరోనా టెస్ట్ ... సరికొత్త కిట్‌కు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ !
By: Tupaki Desk | 20 May 2021 8:30 AM GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. మరోవైపు కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. ప్రభుత్వాస్పత్రిలో పరిమిత సంఖ్యలోనే టెస్ట్‌లు చేస్తున్నారు. ప్రైవేట్ కు ఒకవేల వెళ్లాలని అనుకుంటే వేలకు వేలు వసూలు చేస్తున్నారు. మరోవైపు టెస్ట్ ల కోసం వచ్చే వారిని చూసి చాలా మంది భయపడుతున్నారు. టెస్ట్ కోసం వెళ్లి లేని వైరస్ కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే , ఇక నుంచి ఈ బాధలు ఉండవు. ఇంటి వద్దే మనమే కరోనా టెస్ట్ చేసుకునే కిట్ వచ్చేసింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇంట్లోనే.. మనకు మనమే టెస్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మహారాష్ట్రలోని మైల్యాబ్ అనే సంస్థ తయారు చేసిన కొవిసెల్ఫ్ అనే స్వీయ ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ కు అనుమతులను ఇచ్చింది.
ముక్కులో నుంచి తీసిన స్వాబ్‌తో పరీక్ష ఉంటుందని, ఉత్పత్తిదారు యూజర్ మాన్యూవల్ లో సూచించిన ప్రకారం పరీక్ష చేసుకోవచ్చని తెలిపింది. విచ్చలవిడిగా దీనితో ఇంట్లో పరీక్షలు నిర్వహించకూడదని హెచ్చరించింది. ఈ కొత్త యాంజిజెన్ కిట్‌తో ఇంట్లో చేసిన పరీక్షలో పాజిటివ్‌గా తేలితే.. వ్యాధి నిర్ధారణ అయినట్లుగానే పరిగణించాలని పేర్కొంది. వారికి మళ్లీ టెస్టులు అవసరం లేదని తెలిపింది. లక్షణాలు ఉండీ ఒకవేళ నెగిటివ్‌గా వస్తే మాత్రం... అలాంటి వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్ టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని కోరింది. వైరల్ లోడ్ తక్కువగా ఉంటే.. కొన్నిసార్లు యాంటిజెన్ పరీక్షల్లో దొరక్కపోవచ్చని వివరించింది. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చినా, లక్షణాలుంటే వారిని కోవిడ్ బాధితులుగా పరిగణించి చికిత్స అందించాలని, ఆర్ టీపీసీఆర్ ఫలితం వచ్చేదాకా వీరి విషయంలో ఆరోగ్యశాఖ ఇచ్చిన హోం ఐసోలేషన్ ప్రొటోకాల్ ను పాటించాలని స్పష్టం చేసింది. హోం టెస్టింగ్ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్లలో అందుబాటులో ఉందని, దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.