Begin typing your search above and press return to search.
ఉపాధ్యాయులందరికీ కరోనా పరీక్షలు.. విద్యా శాఖకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
By: Tupaki Desk | 25 Oct 2020 10:10 AM GMTకరోనా విజృభిస్తుండటంతో ఈ ఏడాది పాఠశాలలకు మూత పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో ఐదు నెలలు వృథా అయ్యాయి. గత విద్యా సంవత్సరంలోనే కరోనా వ్యాప్తి మొదలవడంతో చివరి రెండు నెలలు మార్చి, ఏప్రిల్ లలో పాఠశాలకు మూత వేసి ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించారు. సెలవులు ముగిసిన తర్వాత కూడా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండడంతో బడులు తెరుచుకోలేదు. అయితే కొద్ది రోజుల కిందట ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠాలు మొదలు పెట్టింది. ఇప్పుడిక ప్రైమరీ సహా విద్యార్థులందరికీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది.
నవంబర్ రెండో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలు ప్రారంభం అయ్యే లోగా ఉపాధ్యాయులు అందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడిక పాఠశాలలకు చిన్న పిల్లలు వచ్చే అవకాశం ఉండడంతో ఉపాధ్యాయుల నుంచి పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోవిడ్ టెస్ట్ లు చేయించుకుని రిపోర్టులను విద్యాశాఖ అధికారులకు అందజేసి ఆ తర్వాతే విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.