Begin typing your search above and press return to search.

కుక్కలకు కరోనా పరీక్షలు ..ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   29 April 2020 6:30 PM GMT
కుక్కలకు కరోనా పరీక్షలు ..ఎక్కడంటే ?
X
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుండగా కరోనా నిర్దారణ పరీక్షలకు డిమాండ్ పెరిగింది. జంతువులకూ పరీక్షలు తప్పడం లేదు. కుక్కలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల ఫిర్యాదు చేయడంతో అధికారులు అందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో కరోనా సోకిందని అనుమానించారు. గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని అధికారులకు తెలియ‌ప‌రిచారు. దీంతో పశుసంవర్ధ శాఖకు చెందిన మెడిక‌ల్ టీమ్ గ్రామంలోని కుక్కల నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిర్వ‌హించారు. అనంతరం వాటికి కరోనా సోకలేదని స్పష్టం చేశారు. గ్రామ సమీపంలోని కోళ్ల వ్యర్థాలను తిని కుక్కలు వింతగా ప్ర‌వ‌ర్తిస్తున్నాయని.. అంతేగానీ వాటికి కరోనా వైరస్ సోకలేదని డాక్టర్ రాజేశ్ వెల్ల‌డించారు. వాటికి రోగ నిరోధక టీకాలు వేశామని ఆయన తెలిపారు. మెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ జూలో కొన్ని పులులు, సింహాలకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నగరంలో రెండు పెంపుడు పిల్లులకు కూడా కరోనా సోకింది.