Begin typing your search above and press return to search.

వీవీఐపీలకు కూడా..: రాష్ట్రపతికి కరోనా పరీక్షలు

By:  Tupaki Desk   |   21 March 2020 6:10 AM GMT
వీవీఐపీలకు కూడా..: రాష్ట్రపతికి కరోనా పరీక్షలు
X
కరోనా వైరస్ వ్యాప్తి వీవీఐపీలను కూడా తాకింది. ఆ వైరస్ వ్యాప్తి ఏకంగా దేశ ప్రథమ పౌరుడు నివసించే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు పాకింది. కరోనా అనుమానితులు ఉన్నవారు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరవడంతో కలకలం రేగింది. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారికి కూడా కరోనా వచ్చిందనే భయం అందర్ని చుట్టుముడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ వర్గాలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఆ వైరస్ పాకిందేమోననే అనుమానంతో ఆయనకు కరోనా వైరస్ వైద్య పరీక్షలు చేయనున్నారు. దీంతో కరోనా వైరస్ ప్రభావం సామాన్యులతో పాటు వీవీఐపీల పై కూడా పడిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన పర్యటనలన్నింటిని రద్దు చేసుకున్నారు.

ఇటీవల లండన్ సింగర్ కనికా కపూర్‌ తిరిగొచ్చి ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని ఓ హోటల్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులకు ఆమె పార్టీ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రెయిన్ హాజరయ్యారు. కరోనా లక్షణాలతో ఉన్న ఆమెను కలిసిన ఎంపీ దుష్యంత్ అనంతరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దుష్యంత్ రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి ఫొటోలు దిగి మాట్లాడారు. అయితే కనికా కపూర్ కు కరోనా లక్షణాలున్నాయని తేలడంతో ఆమెను కలిసిన దుష్యంత్ కు కూడా ఆ వైరస్ సోకి ఉంటుందని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో దుష్యంత్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవడంతో రాష్ట్రపతి భవన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే వసుంధర రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ స్వీయ నిర్బంధం (క్వారెంటైన్)లో ఉన్నారని తెలియడంతో రాష్ట్రపతి భవన్ వర్గాలు రాష్ట్రపతికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కనికా కపూర్ ను కలిసిన అనంతరం ఢిల్లీ వచ్చి రాష్ట్రపతి భవన్ తో పాటు దాదాపు రెండు గంటల పాటు పార్లమెంటు భవనంలో గడిపారు. దీంతో పార్లమెంట్ సమావేశాలను రద్దు చేయాల్సిందిగా తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ కోరారు. అతడి రాకతో తమకు కరోనా వైరస్ సోకిందని వ్యక్తం చేశారు.