Begin typing your search above and press return to search.

సిటీ స్కాన్ తో కరోనా పరీక్షలు ప్రమాదకరం..!

By:  Tupaki Desk   |   21 Aug 2020 2:30 AM GMT
సిటీ స్కాన్ తో కరోనా పరీక్షలు ప్రమాదకరం..!
X
కరోనా తీవ్రత అధికం అవడం తో ఆస్పత్రికి క్యూ కట్టే వారి సంఖ్య అధికం అయ్యింది. వైద్య సిబ్బంది కొరత గా ఉండడం, కోవిడ్ పరీక్షలు నిర్వహించే కిట్లు తక్కువగా ఉండడంతో కరోనా పరీక్షలు నిర్వహణలో కాస్త ఆలస్యం జరుగుతోంది. ఫలితాలు కొన్నిచోట్ల వెంటనే ప్రకటిస్తున్నా .. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం 4 నుంచి 5 రోజుల సమయం పడుతోంది. దీంతో చాలామంది కరోనా టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది వేగంగా ఫలితం వస్తుందంటూ సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. అయితే సిటీ స్కాన్ ప్రమాదకరమని.. సాధారణ ర్యాపిడ్ టెస్టు కిట్ తోనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సిటీ స్కానింగ్ టెస్ట్.. కోవిడ్ నిర్ధారణ పరీక్ష కాదని అంటున్నారు. మనం కరోనా ఉన్నవారి ప్రైమరీ కాంటాక్టులమైతే కరోనా టెస్ట్ కోసం సిటీ స్కాన్ చేయించుకుంటే మొదటి మూడు రోజుల్లో ఎటువంటి ఫలితం చూపించదు. ఒకవేళ పాజిటివ్ ఉన్నా లేనట్లే చూపుతుంది. 50 శాతం రిజల్ట్ తప్పుగానే చూపిస్తుంది. ఆలస్యమైనా ఆర్టీ పీసీఆర్ పరీక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు ఉత్తమమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆర్టీ పీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చి దగ్గు, ఆయాసం మాత్రం ఉంటే.. అప్పుడు మాత్రమే సిటీ స్కాన్ చేయించుకోవాలి. సిటీ స్కాన్ లో 5 కోరైడ్స్ ఉంటే దాదాపు కరోనా ఉన్నట్టే అర్థం. అయితే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. కోరైడ్స్ 6 ఉంటే ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ గా ఉందని అర్థం. సాధారణంగా కరోనా లక్షణాలు కనిపిస్తే ముందుగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించు కోవడమే ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.