Begin typing your search above and press return to search.

కరోనా: దేశ సగటు కన్నా ఆ 7రాష్ట్రాల యావరేజే ఎక్కువ !

By:  Tupaki Desk   |   25 April 2020 5:50 AM GMT
కరోనా: దేశ సగటు కన్నా ఆ 7రాష్ట్రాల యావరేజే ఎక్కువ !
X
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విస్తరిస్తుంది. కరోనాను అడ్డుకోవడానికి కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లాక్ ‌డౌన్ విధించి నెలరోజులు దాటిపోయింది. దీంతో దేశంలో వైరస్ వ్యాప్తిపై ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ అనూప్ కృష్ణన్ నేతృత్వంలో ప్రొఫెసర్ హరిప్రసాద్ సహకారంతో పరిశోధకులు రిసెర్చ్ చేశారు. వారి పరిశోధనలో కీలక అంశాలు వెలుగుచూశాయి.

వీరి పరిశోధనల్లో ఏడు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు అందరిని ఆందోళన కలిగిస్తుంది. జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని గుర్తించారు. ఈ రాష్ట్రాల్లో మూడింట రెండువంతుల వైరస్ కేసులు నమోదయ్యాయని గుర్తించారు.

ఈ బృందం ప్రకృతి పేరుతో పోర్టల్ క్రియేట్ చేశారు. 19 రాష్ట్రాల్లో 100 జిల్లాల్లో వైరస్ 60 శాతం కన్నా ఎక్కుగా ఉంది అని, వైరస్ వ్యాప్తి గుజరాత్‌ లో ఎక్కువ అని.. వైరస్ సోకిన ప్రతీ ఒక్కరు 3.3 వ్యక్తులకు అంటించారని వెల్లడించింది. 100 జిల్లాల్లో 28 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి 1.8గా ఉన్నదని తెలిపింది. ఇందులో రాజస్థాన్ 5, యూపీ 4, మధ్యప్రదేశ్ 4, గుజరాత్ 4, తమిళనాడు 3, మహారాష్ట్ర 3, కర్ణాటక 2, తెలంగాణ 2, పంజాబ్ ఒక జిల్లా ఉన్నాయి.

కేరళ, హర్యానా, తమిళనాడులో వైరస్ వ్యాప్తి రేటు ఒకటి కంటే తక్కువగా ఉంది అని, ఈ మూడు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పాయింట్ 93గా ఉంది. కానీ ఆరు జిల్లాల్లో మాత్రం ఎక్కువగా ఉంది అనితెలిపింది. తమిళనాడు లోని తెన కాశీలో 6.27 ఉండగా, వెల్లూరు లో 1.64 ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మిగతా చోట్ల వైరస్ క్రమంగా తగ్గుతోన్న ఆయా చోట్ల మాత్రం తగ్గడం లేదు.