Begin typing your search above and press return to search.
కరోనా మూడో వేవ్ అలెర్ట్... తాత్కాలిక ఆసుపత్రులు షురూ
By: Tupaki Desk | 10 Nov 2021 2:30 AM GMTకరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం అంతాఇంతా కాదు. భారత్ లోని చాలా కుటుంబాల్లో ఇప్పటికీ ఆరని చిచ్చు పెట్టింది. ఎంతో మంది ప్రాణాలను సెకండ్ వేవ్ సమయంలో బలి తీసుకుంది. అక్కడ ఇక్కడ అని కాకుండా.. భారత్ లోని అన్నీ రాష్ట్రాల్లో తన పంజాను విసిరింది. నాటి పరిస్థితిల్లో రెండో వేవ్ కు సిద్ధంగా లేని భారత్ అందుకు తగిన విధంగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే కొన్న రాష్ట్రాలు పాఠాలు నేర్చుకున్నాయి.
గత కొద్దిరోజులుగా కేంద్ర పదే పదే వల్లివేస్తున్న విషయాన్ని గ్రహించిన రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలను పాటిస్తున్నాయి. గతంలో ఆక్సిజన్, పడకల కొరత అనే రెండు అంశాలు తీవ్రంగా వేధించాయి. చాలా మంది ఆక్సిజన్ లేక ఆసుపత్రికి రాకముందే ప్రాణాలు విడిచారు. మరో పక్క ఆసుపత్రుల్లో బెడ్ల కొరతతో అనేక మంది అంబులెన్సులోనే చికిత్సపొందారు. మరి కొందరు మరణించారు. ఇలాంటి ఘటనలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని... వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు గుజరాత్ ప్రభుత్వం తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణానికి బాటలు వేసింది.
పోర్టబుల్ ఆసుపత్రుల పేరుతో గుజరాత్ లోని రాజ్ కోట్ లో వీటి నిర్మాణాన్ని చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఇండో అమెరికాన్ ఫౌండేషన్ సహాయసహకారంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రులు మరి కొద్ది రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రిల్లో.. సాధారణ వైద్యాలయాల్లో ఉన్నట్లుగానే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కరోన సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు చూసి వీటి నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
రాజ్ కోట్ లో నిర్మిస్తున్న ఈ పోర్టబుల్ ఆసుపత్రి... గుజరాత్ లోనే మొదటిదని చెప్తున్నారు. వీటి నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని సరాసరి జిల్లా కలెక్టర్ గుర్తించారు. అంతేగాకుండా అక్కడ అవసరమైన విద్యుత్ సదుపాయాలను కూడా తమే ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ మహేశ్ బాబు తెలిపారు. నిర్మాణాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు వాటి బాధ్యతను ఇండో అమెరికన్ ఫౌండేషన్ చూసుకుంటుందని వెల్లడించారు.
ఇండో అమెరికాన్ ఫౌండేషన్ ద్వారా పోర్టబుల్ ఆసుపత్రులకు వైద్యా పరికరాలను సమకూర్చుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇదే పూర్తిస్థాయిలోఅందుబాటులోకి వస్తే.. ఒక్కొక్కదానిలో కనీసం వందకు పైగా ఆక్సిజన్ బెడ్లు సమకూర్చ వచ్చని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ లు పలు సార్లు వివిధ రకాలైన వేరియంట్ల గురించి చెప్తూ వస్తున్నారు. మరోసారి కొవిడ్ విజృంభిస్తే మూడోవేవ్ ఉంటుంది అనే హెచ్చరికల నడుము పోర్టబల్ ఆసుపత్రుల నిర్మాణం ఎంతైనా అవసరం ఉంటుంది.
వీటి నిర్మాణం కూడా చౌకగా ఉంటుంది. కరోనా నిజంగా ప్రబలమైతే మాత్రం చాలా తక్కువ సమయంలోనే.. అంటే కేవలం వారం లోనే ఈ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టవచ్చు. చాలా ఆసుపత్రులు ఇప్పుడు ప్రజా నివాసాలకు దగ్గరగానే ఉంటాయి. అదే వీటితో అయితే కొంచెం దూరంగా నిర్మాణం చేపట్టవచ్చు. వీటికి తక్కువ డబ్బుతోనే నిర్మించవచ్చని చెప్తున్నారు ఇండో అమెరికన్ ఫౌండేషన్ సభ్యులు .