Begin typing your search above and press return to search.

తెలంగాణలో భారీగా కరోనా కేసులు.. థర్డ్ వేవ్ సంకేతాలా?

By:  Tupaki Desk   |   5 Jan 2022 4:42 AM GMT
తెలంగాణలో భారీగా కరోనా కేసులు.. థర్డ్ వేవ్ సంకేతాలా?
X
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా ఒక్కరోజులోనే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు చెప్పినట్టుగా థర్డ్ వేవ్ మొదలైందా? అనే భయాందోళనలు కలుగుతున్నాయి.

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కొద్దిరోజులుగా పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రల్లో కర్ఫ్యూలు, నిబంధనలు, బంద్ లు పెట్టారు. తాజాగా తెలంగాణలో రాష్ట్రంలో న్యూ ఇయర్ ఎఫెక్ట్ భారీగానే పడింది.

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా 1000 కరోనా కేసులు నమోదు కావడం సంచలనమైంది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరించినట్టే కేసులు పెరుగుతున్నాయి. రానున్న రెండు వారాలు చాలా జాగ్రత్తలు పాటించాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో అధికారులు చెప్పినట్టు తెలంగాణలో థర్డ్ వేవ్ సంకేతాలు ఏర్పడ్డాయి.

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 63 శాతం కేసులు (659 ) నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత మేడ్చల్ (1196), రంగారెడ్డి (109) జిల్లాల్లోనూ భారీగా కేసులు పెరిగాయి.

రాష్ట్రంలో న్యూఇయర్ కు ముందు గత నెల 29న 3490 కేసులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 4858కి పెరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 42991 నమూనాలను పరీక్షించారు.

ఇక తెలంగాణలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మహబూబాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లోని గురుకులాల్లో తాజాగా కరోనా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సోకింది. దీంతో తెలంగాణలో థర్డ్ వేవ్ మొదలైనట్టేనన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.