Begin typing your search above and press return to search.
థర్డ్ వేవ్ మీద ఈ విశ్లేషణ విన్నాక.. గుండెల మీద భారం తగ్గుతుంది
By: Tupaki Desk | 7 Jun 2021 9:32 AM GMTశోకం మిగిల్చిన సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్లే. దేశ వ్యాప్తంగా కేసుల నమోదులో ఈ విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు టెన్షన్ అంతా థర్డ్ వేవ్ గురించే. ఇన్నాళ్లు పెద్దల్ని కాటేసిన కరోనా మహమ్మారి.. థర్డ్ వేవ్ లో పిల్లల మీద విరుచుకుపడుతుందన్న అంచనాలు భారీగా వినిపిస్తున్న వేళ.. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం ఎలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కోట్లాది మందిలో ఇప్పుడు ఇదే టెన్షన్ గా ఉంది.
అయితే.. అందరూ అనుకుంటున్నట్లుగా థర్డ్ వేవ్ పిల్లల్ని టార్గెట్ చేస్తుందన్నది అర్థం లేని వాదనగా కొందరు చెబుతున్నారు. ఇదే తరహా విశ్లేషణను చేస్తున్నారు ప్రముఖ ఎపిడమాలజిస్టు డాక్టర్ చంద్రకాంత్ లహరియా. ఆయన విశ్లేషణతో పాటు.. తాజాగా చెబుతున్న ఒక ఉదాహరణ గురించి తెలిశాక గుండెల మీద నుంచి పెను భారాన్ని పక్కన పెట్టినట్లుగా అనిపించక మానదు.
కొన్ని చానళ్లలోనూ.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ జరుగుతున్నట్లుగా థర్డ్ వేవ్ అన్నది పిల్లల మీద విరుచుకుపడుతుందన్న మాట నిరాధారమన్నారు. వైరస్ రూపు మార్చుకొని.. మహారాష్ట్రలో పిల్లల మీద భారీ ఎత్తున విరుచుకుపడినట్లుగా సాగుతున్న ప్రచారం నిరాధారమని ఆయన మండిపడుతున్నారు. వాస్తవాల్ని వదిలేసి.. ఈ తరహా ప్రచారాన్ని ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు కరోనా సోకుతుందని చెబుతూ వారిని భయపెట్టటం సరికాదంటున్నారు.
మహారాష్ట్ర ఉదంతాన్ని పలువురు ప్రస్తావిస్తున్న వేళ.. అక్కడేం జరిగిందన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఏప్రిల్ - మే లలో మహారాష్ట్రలోని 99 వేల మంది పిల్లలకు కరోనా సోకింది. కానీ.. ఆ సమయంలో అక్కడ ఏకంగా 29 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే.. మొత్తం కేసుల్లో పిల్లల వాటా 3.5 శాతం. ఇది సాధారణమే. పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే అని సెరో సర్వే తేల్చింది. అయితే.. పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటేనే కొవిడ్ తీవ్రత ఉంటుంది. అంతే తప్పించి.. థర్డ్ వేవ్ కు.. పిల్లలకు లింకు వేయటం సరికాదు’’ అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. థర్డ్ వేవ్ మీద ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా ఉన్న ఈ వాదనపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజం బయటకు వచ్చే వీలుంది.