Begin typing your search above and press return to search.

కరోనా భారిన పడ్డ 65 మంది డబ్ల్యూహెచ్‌వో సిబ్బంది !

By:  Tupaki Desk   |   18 Nov 2020 4:00 PM GMT
కరోనా భారిన పడ్డ 65 మంది డబ్ల్యూహెచ్‌వో సిబ్బంది !
X
ఆ దేవుడి చూపు నుండి అయినా తప్పించుకోవచ్చు కానీ, కరోనా కి చిక్కకుండా తప్పించుకోవడం కష్టంగా మారుతుంది. అసలు ఎవరికి , ఎప్పుడు కరోనా సోకుతుందో అంతుచిక్కడం లేదు. ఇక కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన సమయంలో నుండి అన్ని దేశాలకి సూచనలు , సలహాలు ఇస్తూ కీలకంగా వ్యవహరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు మహమ్మారి భారిన పడ్డారు. జెనీవాలోని కార్యాలయంలో పనిచేస్తున్న 65 మందికి కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

‘ది అసోసియేటెడ్‌ ప్రెస్‌’కు చేజిక్కించుకున్న ఓ ఇ-మెయిల్‌ ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. వైరస్ సోకిన వారిలో సగం మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తుండగా.. 32 మంది మాత్రం కార్యాలయానికి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ వార్తలను WHO అధికారులు ఖండించారు. జెనీవాలో ఎవరికీ కరోనా‌ సోకలేదని చెబుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ వో కార్యాలయాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూనే.. స్క్రీనింగ్, శానిటైజేషన్, వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే , అంత పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో సిబ్బంది వైరస్ బారినపడటం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే , యూరప్‌ దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. స్విట్జర్లాండ్‌ లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జెనీవా లోని డబ్ల్యూహెచ్ ‌ఓ కార్యాలయ సిబ్బంది కూడా కరోనా బారిన పడినట్లు చాలామంది భావిస్తున్నారు.