Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో అన్ని వేల మంది పోలీసులకు కరోనా?
By: Tupaki Desk | 17 Aug 2020 9:00 AM ISTకరోనా తీసుకొచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ విధించినా.. పెద్దగా ఫలితం లేకుండా పోయిందన్న భావన కలుగక మానదు. అయితే.. మరీ ముందుగా లాక్ డౌన్ విధించారని.. సరైన సమయంలో విధించి ఉంటే మరింత ముప్పు తప్పేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే..అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా కేసులు.. ఇప్పుడు రోజుకో రికార్డు దిశగా పయనిస్తున్నాయి. రోజు వారీగా నమోదవుతున్నకేసుల అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు కావటం తెలిసిందే. మరణాలు కూడా ఆ రాష్ట్రంలోనే ఎక్కువ. ఇదిలా ఉంటే.. మరో ముఖ్యమైన విషయం బయటకు వచ్చింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో భారీగా పోలీసులు కరోనా బారిన పడిన రాష్ట్రం కూడా మహారాష్ట్రేనని చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో పోలీసులు కరోనా బారిన పడినప్పటికీ.. మహారాష్ట్రలో మాదిరి మాత్రం లేదంటున్నారు.
ఇప్పటి వరకు బయటకు వచ్చిన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రంలో మొత్తం 12990 మంది పోలీసులు కరోనాకు గురి కాగా.. వారిలో 125 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే 303 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు 9850 మంది పోలీసులు కరోనా బారిన పడి కోలుకోగా.. 2315 మంది యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. దేశంలో రోజువారీగా కొత్తగా నమోదయ్యే కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు దగ్గర దగ్గరగా 65వేల కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఇది కాస్తా డెబ్భై వేల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ.. దీని కంటే కూడా.. మరణిస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది.
నిన్నటికి నిన్న 944 మంది దేశ వ్యాప్తంగా మరణించినట్లుగా తెలుస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న మరణాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు దేశంలో 25.89లక్షల కేసులు నమోదు కాగా.. ఇప్పటికి 6.77 లక్షల కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరణాలు యాభై వేల వరకు చోటు చేసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.