Begin typing your search above and press return to search.
వెర్రెక్కిన అభిమానం.. వందలాది మందికి కరోనా!
By: Tupaki Desk | 1 July 2021 11:30 PM GMTప్రపంచ క్రీడల్లో ఫుట్ బాల్ కు ఉన్న ఆదరణ ఎలాంటిదో.. మాటల్లో చెప్పడం కష్టం. మైదానంలో ఆట ఆడేవారికన్నా.. గ్యాలరీల్లోని ప్రేక్షకులే వెర్రెత్తిపోతారు. అనుకున్న ఫలితం రాకపోతే.. ఇరు జట్ల అభిమానులు తన్నుకు చావడానికి కూడా సిద్ధమైపోతారు. ఇలాంటి ఘటనలకు లెక్కేలేదు. ఫుట్ బాల్ ను అంతలా ప్రేమించే వారికి.. కరోనా వచ్చి ఆ ఎంజాయ్ మెంట్ ను దూరం చేసింది. దాదాపుగా రెండేళ్లుగా ఫుట్ బాల్ మ్యాచులకు మొహం వాచిపోయి ఉన్నారు ఫ్యాన్స్.
ఇలాంటి సమయంలో లండన్ లో యూరో ఛాంపియన్ షిప్ నిర్వహించారు. ఇక, వీళ్లెందుకు ఆగుతారు చెప్పండి? కరోనా లేదు గిరోనా లేదంటూ స్టేడియానికి పయనమయ్యారు స్కాట్లాండ్ ఫ్యాన్స్. వందలాది కిలోమీర్లు ప్రయాణించి మరీ మ్యాచ్ లకు హాజరయ్యారు.
అంతేనా.. స్టేడియంలో రెచ్చిపోయారు. గుంపులు గుంపులు ఉండి ఈలవేసి గోల చేశారు. బార్లు, పబ్ లలో రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత ఇళ్లకు తిరుగుపయనం అయ్యారు. సీన్ కట్ చేస్తే.. మ్యాచ్ కు వెళ్లి వచ్చిన వారిలో దాదాపు 1990 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో దాదాపు 1300 మంది కేవలం స్కాట్లాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ కోసం వెళ్లివచ్చారు.
ఇక, ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. స్కాట్ లాండ్ ఆటగాడు బిల్లీ గిల్ మౌర్ సైతం కరోనా బారిన పడ్డాడు. దీంతో.. ఇతనితో దగ్గరగా ఉన్న మరో ఇద్దరు ఆటగాళ్లు సైతం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మ్యాచులకు వెళ్లడమే కాకుండా.. కరోనా నిబంధనలు పాటించకుండా రచ్చేసి, దానికి అడ్డంగా దొరికిపోయారు. ఈ వార్త చూసిన వారంతా.. టీవీలో చూస్తే పోయేదానికి అంత దూరం వెళ్లి, కరోనా అంటించుకొని రావాలా? అని సెటైర్లు వేస్తున్నారు.