Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా
By: Tupaki Desk | 13 Sep 2020 6:30 AM GMTఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. శనివారం కూడా అదే జోరు కొనసాగింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75465 టెస్టులు చేయగా దాదాపు 10వేల కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో కరోనా కేసులు 5.50 లక్షలు దాటేశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,57,587 కు పెరిగాయి.
ఏపీలో కరోనా బారినపడే ప్రజాప్రతినిధుల శాతం పెరుగుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు కరోనా సోకింది.
తాజాగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
కోటం రెడ్డికి కరోనా అని తెలియగానే అభిమానులు అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
ఇక తనతోపాటు వివిధకార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి నేతలకు సూచించారు. నెల్లూరులో వరుసగా నేతలు కరోనా బారినపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.