Begin typing your search above and press return to search.
సోనియాకు కరోనా.. ఈడీ విచారణ ముంగిట ట్విస్ట్..
By: Tupaki Desk | 2 Jun 2022 8:50 AM GMTకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. బుధవారం సాయంత్రం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో హోం ఐసొలేషన్ కు వెళ్లారు. సోనియాకు లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలిసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సోనియాకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి సైతం నోటీసులిచ్చింది. సోనియాను ఈ నెల 8న, రాహుల్ ను గురువారమే హాజరు కావాలని కోరింది.
అయితే, రాహుల్ మాత్రం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని.. దీంతో తన విచారణను ఈ నెల 5 తర్వాతకు వాయిదా వేయాలంటూ ఈడీకి ఆయన లేఖ రాశారని వారు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ కుమార్ బన్సల్‌లను ఈడీ ఇటీవల ప్రశ్నించింది.మరోవైపు ఈడీ ఆదేశాలను సోనియా యథాతథంగా పాటిస్తారని కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, రణదీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు. కాగా, అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా వైరస్ బారినపడ్డారు.దీంతో ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 'స్వల్ప జ్వరంతో పాటు కొన్ని కొవిడ్ లక్షణాలతో సోనియా గాంధీ బాధపడుతున్నారు. దీంతో ఆమె ఐసోలేషన్‌లో ఉండిపోయారు.ప్రస్తుతం సోనియా గాంధీకి అవసరమైన వైద్య సహాయం అందుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు జూన్ ఎనిమిదో తేదీన హాజరు కావాల్సి ఉంది' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వెల్లడించారు.
వరుసగా కార్యక్రమాల్లో..సోనియా గాంధీ గత వారం రోజులుగా నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆమెకు పాజిటివ్ వచ్చింది. అంతకుముందే రాజ్ ఘాట్ లో ఆజాదీ గౌరవ్ ముగింపు యాత్రలో పాల్గొన్నారు.అయితే, సోనియాను ఇటీవల కలిసిన ఒకరిని కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆమెకు బుధవారం తేలికపాటి జ్వరం వచ్చింది. పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఇదీ నేషనల్ హెరాల్డ్ కేసు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు-పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. విచారణ కోసం తమ ముందు గురువారం హాజరు కావాలని రాహుల్‌ను, ఈ నెల 8న రావాలని సోనియాను ఆదేశించింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వారిద్దరి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు తెలిపింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణకర్తగా ఉంది. సోనియా, రాహుల్ సహా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రమణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే, నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జూన్ 8న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపించింది. ఈ కేసులో వారిద్దరి స్టేట్‌మెంట్లను రికార్డు చేసేందుకే సమన్లు జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో సోనియా గాంధీ కొవిడ్ బారినపడ్డారు.
మరి విచారణకు వెళ్తారా?పాజిటివ్ వచ్చినందున సోనియా ఐసొలేట్ కావడం తప్పనిసరి. అయితే, 8వ తేదీన (వచ్చే బుధవారం) విచారణకు ఆమె హాజరు ఎలా అన్నది చర్చనీయాంశం కానుంది. విచారణ తేదీ నాటికి సోనియాకు పాజిటివ్ వచ్చి 8 రోజులవుతుంది. ఐసొలేషన్ సమయం ముగియదు. మరి.. ఈలోగా నెగెటివ్ వస్తే విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. అసలు ఈడీనే విచారణను వాయిదా వేస్తే సమస్యే ఉండదు.