Begin typing your search above and press return to search.
ఎవరెస్ట్ ను తాకిన కరోనా...బేస్ క్యాంపులో ఒకరికి పాజిటివ్ !
By: Tupaki Desk | 24 April 2021 1:30 AM GMTదేశంలో కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరూ కరోనా భారిన పడుతున్నారు. ఒక్కరోజులోనే ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఇండియాలో నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా ఎత్తైన ఎవరెస్టు ను కూడా తాకింది. నేపాల్ లోని ఈ శిఖరానికి కూడా కరోనా ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఈ శిఖర బేస్ క్యాంపులో గుర్తించారు. ఆ వ్యక్తిని హెలికాప్ట్ లో ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్టు పర్వతంపైకి ఈ వైరస్' 'చేరుకోవడం' అత్యంత ఆశ్చర్యకరం, దారుణం కూడా అంటున్నారు.
అయితే ఎత్తయిన పర్వతాలను ఎక్కుతున్నప్పుడు కొంతమందికి పల్మనరీ ఎడిమా అనే లక్షణాలు, సిక్ నెస్ కనబడుతాయట. నిజానికి ముగ్గురు పర్వతారోహకులకు కరోనా పాజిటివ్ సోకిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వీరిని వెంటనే బేస్ క్యాంపు నుంచి తరలించినట్టు వెల్లడించింది. ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియడంలేదని, చాలానే ఉంటాయని భావిస్తున్నామని ఓ సాహస యాత్రా బృంద నేత ఒకరు అన్నారు. నేపాల్ లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ యాత్రా బృందం ఈసారి తమ ఎవరెస్టు పర్వతారోహణ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. అయితే నేపాల్ టూరిజం శాఖ మాత్రం పలువురు విదేశీ పర్వతారోహకులకు పర్మిట్లు ఇచ్చింది. దాదాపు 377 మందికి అనుమతి లభించింది. 2019 లో 11 మంది పర్వతారోహకులు మరణించారు. కాగా- చాలా వరకు వైరస్ లక్షణాలు ఆల్టిట్యుడ్ సిక్ నెస్ ని, సాధారణంగా పర్వతారోహకులను వేధించే కుంభ్ దగ్గును పోలి ఉంటాయని అంటున్నారు. కరోనా కేసుల్ని నియంత్రణలోకి తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తుంది.