Begin typing your search above and press return to search.
ప్రతి ఒక్కరికి కరోనా లక్షణం:..: సహకరించని జనం
By: Tupaki Desk | 24 Jan 2022 8:31 AM GMTతెలంగాణలో కరోనా కేసులు విపరీతం దాల్చడంతో ప్రభుత్వం ఐదో విడత జ్వర సర్వేను చేపట్టింది. ఇంటింటికి వెళ్లి వైద్య బృందాలు ప్రతీ ఒక్కరిని పరీక్షిస్తున్నారు. జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉంటే వారికి కరోనా కిట్ ను అందజేస్తున్నారు. తీవ్ర లక్షణాలు ఉంటే టెస్టు చేస్తున్నారు. అయితే గత ఐదురోజులుగా వైద్య బృందం చేసిన సర్వేలో ప్రతీ ఇంట్లో ఒకరు ఏదో లక్షణంతో బాధపడుతునుట్లు తేలింది. కొందరిరిలో స్వల్ప, మరికొందరిలో తీవ్ర లక్షణాలు ఉంటున్నాయని వైద్య సిబ్బంది తెలుపుతోంది. ఇప్పటి వరకు 42.30 లక్షల మంది ఇళ్లకు వెళ్లిన వారికి ఏదో ప్రతి ఒక్కరూ ఒక్కో లక్షణంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి.. లేదా అన్ని లక్షణాలు ఒకరిలో ఏ ఇంటికెళ్లినా ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. వాతావారణంతో పాటు కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రతీ ఒక్కరిలో కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. ఇదంతా థర్డ్ వేవ్ మొదలైన తరువాతే కనిపించడం ఆందోళనకకర విషయం. ‘ఇంటింటికి ఆరోగ్యం’ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఫీవర్ సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది ఏఎన్ఎంలు 7 వేల మందికి పైగా ఆశా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందం 50 ఇళ్ల వరకు సర్వే చేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలను పరీక్షించి వారిలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే కరోనా కిట్ ను అక్కడే అందజేస్తున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,78,079 మందిలో పలు రకాల లక్షణాలను గుర్తించి వారికి కరోనా కిట్లను అందజేశారు. అలాగే ఆదివారం ఒక్కరోజే 13.04 లక్షల ఇళ్లల్లో సర్వే చేయగా 50,833 మందిలో లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఫీవర్ సర్వేకు కొందరు సహకరిస్తుండగా మరికొందరు సహకరించడం లేదని వైద్య సిబ్బంది తెలుపులున్నారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించడం లేదని అంటున్నారు. కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని అంటున్నారు. వరంగల్ జిల్లాలో 1,03,021 ఇళ్లల్లో సర్వే నిర్వహించారు. 4 వేల మందికి పైగా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలలో 1,30,558 ఇళ్లలో సర్వే చేసి 4,519 మందిలో లక్షణాలు గుర్తించారు. వారిని హోం ఐసోలేషన్లో ఉండమని చెప్పి కరోనా కిట్లను అందజేశారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 5,41, 763 మంది ఇళ్లకు వైద్య బృందం వెళ్లి పరీక్షించారు. ఇందులో 14,875 మందికి లక్షణాలు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9,603 మందికి, నిజామాబాద్ జిల్లాలో 4,164 మందికి కరోనా కిట్లను అందజేశారు.
అయితే చాలా మందికి రోజుల తరబడి దగ్గు, జలుబు వంటి లక్షణాలు తగ్గడం లేదు. వీరు స్థానిక వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటున్నారు. అప్పటి తగ్గకపోవడంతోనే కరోనా టెస్టులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి పాజిటివ్ తేలితే అప్పటికే అతనితో కలిసున్న వారికి వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు అంటున్నారు. కనీసం ఇంటింటికి తిరుగుతున్న వైద్య బృందానికి సహకరిపంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరి కొందరు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవడంతో ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారని అంటున్నారు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకిందని కొందరు వాపోతున్నారు.
ఇక వైద్యులు పరీక్షించి చెబితే తప్ప తమకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో వైద్య సిబ్బందికి చెప్పడం లేదని వైద్యాధికారులు వాపోతున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు చెబితే తమను చుట్టుపక్కల వారు వేరే రకంగా చూస్తారనే భయంతో తమకు ఎలాంటి లక్షణాలు లేవని చెబుతున్నట్లు వైద్య సిబ్బంది తెలుపుతున్నారు.