Begin typing your search above and press return to search.
73 రకాలుగా రూపాంతరం చెందిన కరోనా..!
By: Tupaki Desk | 17 Aug 2020 10:45 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర తరం అవుతుండడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. మన దేశంలో ఇప్పటికే 25 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి ఇంటా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అసలు అది ఎలా వస్తుందో ఇప్పటికీ పూర్తిగా అంతుబట్టడం లేదు.
వ్యాధి బారిన పడి కొందరు మృతిచెందుతుండగా, కొందరు కోలుకుంటున్నారు. అయితే కరోనా వస్తే అందరికీ ఒకేలాగా తీవ్రత ఉండడంలేదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటోంది. కొందరు తేలిక పాటి లక్షణాల తో బయట పడుతుండగా, మరి కొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వందేళ్లు దాటినా వృద్ధులు కూడా కొందరు కరోనాను జయించగా, మరోవైపు 20 ఏళ్ల లోపు ఉన్న యువకులు కరోనాతో మృతి చెందుతున్నారు.
ఈ కారణమే అంతు పట్టడం లేదు. ఈ విధంగా ఉండటానికి కరోనా లోని వివిధ రకాలే కారణం. తీవ్రత కూడిన కరోనా వస్తేనే మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా రూపాంతరాల పై ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా, కరోనా 73 రకాలుగా రూపాంతరం చెందినట్లుగా కనుగొన్నారు. సీఎస్ఐఆర్, ఐజీఐబీతో పాటు భువనేశ్వర్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్ఎంయూ ఆసుపత్రి పరిశోధకులు కరోనా రూపాంతరాల పై పరిశోధనలు చేశారు. అది 73 రకాలుగా రూపాంతరం చెందిందని గుర్తించారు.
కరోనా జాతిలో బీ 1.112, బీ 1, అనే రెండు వంశాలున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా ఎన్ని రకాలుగా రూపాంతరం చెందినా దానికి విరుగుడుగా వ్యాక్సిన్ కనుగొంటే అడ్డుకట్ట వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీకా సిద్ధమై మార్కెట్ లోకి వస్తేనే కరోనాకు అడ్డుకట్ట వేయగలం. లేకపోతే వర్షాకాలంలో కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.