Begin typing your search above and press return to search.
దేశంలో కరోనా కల్లోలం డీజీసీఏ కీలక నిర్ణయం , ఏంటంటే ?
By: Tupaki Desk | 14 March 2021 12:30 AM GMTదేశంలో కరోనా మహమ్మారి జోరు తగ్గడం లేదు. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ భారత్ లో కరోనా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా డీజీసీఏ దానికి తగ్గ చర్యలు తీసుకుంటోంది. అందుకుగాను విమానంలో మాస్క్‌లు సరిగా ధరించకపోతే లేదా కరోనా వైరస్ నిబంధనలను సరిగ్గా పాటించకపోతే ప్రయాణీకులను దింపేస్తామని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శనివారం ఒక ప్రకటన లో తెలిపింది.
అలాగే, పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ప్రయాణీకులు ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తే, ఆ ప్రయాణీకుడిని ‘విధేయత లేని ప్రయాణీకులు' గా పరిగణిస్తామని డీజీసీఏ హెచ్చరించింది. అలాగే అర్థంతరంగా విమానం నుండి దించేస్తారని తెలిపింది. మార్చి 13న రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో డీజీసీఏ , "విమాన ప్రయాణాన్ని చేపట్టే కొంతమంది ప్రయాణికులు 'కోవిడ్ -19 ప్రోటోకాల్'లకు కట్టుబడి ఉండట్లేదు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో , విమానాశ్రయంలో ఉన‍్నంతసేపు అన్ని సమయాల్లో మాస్క్ లను కచ్చితంగా ధరించాలని పేర్కొంది. విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని తెలిపింది.
విమానశ్రాయ ఎంట్రీలో మోహరించిన సిఐఎస్ఎఫ్ , ఇతర పోలీసు సిబ్బంది మాస్క్ ధరించకుండా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరీనీ అనుమతించకుండా చూసుకోవాలని తెలిపింది. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా భద్రత , తనిఖీ అధికారులు,ఇతర పర్యవేక్షక అధికారులు చూడాలని డీజీసీఏ కోరింది.విమానాశ్రయ ప్రాంగణంలో ప్రయాణీకులు సరిగ్గా మాస్క్‌లు ధరించేలా చూడాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని విమానాశ్రయ డైరెక్టర్ , టెర్మినల్ నిర్వాహకులను డీజీసీఏ కోరారు.