Begin typing your search above and press return to search.

కరోనా అప్డేట్ : దేశంలో 34 లక్షల కేసులు ,62,550 మరణాలు !

By:  Tupaki Desk   |   29 Aug 2020 7:50 AM GMT
కరోనా అప్డేట్ : దేశంలో 34 లక్షల కేసులు ,62,550 మరణాలు !
X
ఇండియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజురోజుకి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. కరోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కేవలం గత 24 గంటల్లో 76,472 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,021 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్‌ లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 34,63,973కు చేరింది. మరోవైపు.. ఇప్పటివరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 62,550కి చేరింది. మొత్తం బాధితుల్లో 26,48,999 మంది కోలుకోగా..7,52,424 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య 34 లక్షలు దాటింది.

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత తమిళనాడు , ఏపీ రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర లో కరోనా కేసుల సంఖ్య 7,47,995కి చేరింది. ఆగస్టు 4 నుంచి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు భారత్‌ లో నమోదవుతున్నాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల శాతం 22గా ఉంది. దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 76.47 శాతంగా ఉంది.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2932 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మరణించారు. 1580 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 520 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 17,415కి చేరింది. 87,675 కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 799 మంది చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో 28,941 యాక్టివ్ కేసులున్నాయి. 22,097 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇక , ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గడచిన 24 గంటల్లో మళ్లీ భారీగా పెరిగింది. 24 గంటల్లో 10,621 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. అలాగే, 24 గంటల వ్యవధిలో ఏపీలో 92 కరోనా మరణాలు రికార్డు అయ్యాయి