Begin typing your search above and press return to search.

వరల్డ్ అప్డేట్: 70వేల మరణాలు..40గంటల్లో 10వేల మంది

By:  Tupaki Desk   |   7 April 2020 6:50 AM GMT
వరల్డ్ అప్డేట్: 70వేల మరణాలు..40గంటల్లో 10వేల మంది
X
ప్రపంచానికి కరోనా కిల్లర్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఏకంగా 70వేలు దాటింది. ఇటలీ - స్పెయిన్ దేశాల్లో కరోనా నెమ్మదించడం ఊరట కలిగిస్తోంది. కానీ గడిచిన 40 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10వేల మంది చనిపోవడం బీతావాహంగా ఉంది. అమెరికాలో అయితే శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. వైద్యులు తమ కుటుంబ సభ్యులను కూడా కలవలేని దుస్తితి నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 13.47 లక్షలు దాటింది. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 74769 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ - స్పెయిన్ లో కరోనా తీవ్రత తగ్గింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 16వేలకు చేరింది. స్పెయిన్ లో 13వేల మంది బలయ్యారు. ఫ్రాన్స్ లో 8వేల మంది మరణించగా - బాధితుల సంఖ్య 93వేలు దాటింది.

ప్రస్తుతం ఇటలీ - స్పెయిన్ - అమెరికా దేశాలు కరోనా కేసుల్లో చైనాను దాటేశాయి. ఫ్రాన్స్ - జర్మనీలు కూడా కేసుల్లో చైనాను అధిగమించాయి. జర్మనీలో కరోనా రోగుల సంఖ్య 1 లక్ష దాటింది. 1584మంది చనిపోయారు.

బ్రిటన్ లో ప్రధాని బోరిస్ కు కరోనా విషమించడంతో ఐసీయూకు తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉంది. కరోనా మృతుల సంఖ్య బ్రిటన్ లో 5వేలకు చేరింది.

అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3.37లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 9620కు చేరువగా ఉంది. అమెరికాలో ఈరోజు 330 మందికి పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. సామాన్యులు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడం లేదు. ఇక వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు ఇష్ట పూర్వకంగా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారు ఇంటికి కూడా వెళ్లకుండా సేవలందిస్తున్న స్థితి అమెరికా లో నెలకొంది.

*భారత్ లో 4వేలు దాటిన కరోనా కేసులు

భారత్ లోనూ కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 114 మంది మరణించగా.. 3981మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 354 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో దీని తీవ్రత ఉంది.

* తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా

తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణ లో కొత్తగా 30 కరోనా కేసులు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కు చేరింది. వీరిలో కొందరు కోలుకోగా.. ప్రస్తుతం 308 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో వైరస్ కారణంగా 11 మంది చనిపోయారు.

*ఏపీలో 303 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కేసుల సంఖ్య 303కు చేరింది. వీరిలో ముగ్గురు మరణించారని ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కరోనా కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది.