Begin typing your search above and press return to search.

వరల్డ్ అప్డేట్: 96వేల కరోనా మృతులు.. 16లక్షల బాధితులు

By:  Tupaki Desk   |   10 April 2020 6:00 AM GMT
వరల్డ్ అప్డేట్: 96వేల కరోనా మృతులు.. 16లక్షల బాధితులు
X
కరోనా మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఏకంగా 96వేలు దాటింది. ఒక్క అమెరికాలోనే 2000మంది బాధితులు చనిపోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 208 దేశాలకు కరోనా పాకింది. యూరప్, అమెరికాలో తీవ్రంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 16.03 లక్షలు దాటింది. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 95700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 49వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 6వేల మంది వైరస్ బారిన పడ్డారు.

యూరప్ లో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ఇటలీలో 18729మంది, స్పెయిన్ లో 15447మంది, ఫ్రాన్స్ లో 12210మంది, బ్రిటన్ లో 7978 మంది, జర్మనీలో 2600మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు కూడా లక్షల్లో ఉన్నారు.

అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.68లక్షలకు చేరగా.. 16691మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్ లో 6వేల మంది చనిపోయారు. కరోనా వైరస్ తీవ్రత వల్ల న్యూయార్క్ లోనే ఎక్కువమంది చనిపోయారు. ఇక చైనాలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఇరాన్ లో 4110, బెల్జియంలో 2523మంది నెదర్లాండ్ లో 2396మంది, స్విట్జర్లాండ్లో 948మంది మందికి కరోనాతో మరణించారు. రష్యాలోనూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇక భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5865కు చేరింది. ఇప్పటివరకు దేశంలో 169మంది చనిపోయారు. ఏకంగా 478మందికి వ్యాధి నయం అయ్యింది.

* తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా
తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో కొత్తగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తొలి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయ్యింది. వేములవాడ నుంచి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో ఒక ముస్లిం యువకుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 478కు చేరింది. ఇక తెలంగాణలో వైరస్ కారణంగా 11 మంది చనిపోయారు.

*ఏపీలో 365కు చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అనంతపురం జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటివరకు 10 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా కేసుల సంఖ్య 329కు చేరింది.