Begin typing your search above and press return to search.

ఇండియాలో క‌రోనా.. ఆరునెల‌ల క్షీణ స్థాయికి!

By:  Tupaki Desk   |   21 Sep 2021 7:17 AM GMT
ఇండియాలో క‌రోనా.. ఆరునెల‌ల క్షీణ స్థాయికి!
X
దేశంలో క‌రోనా ప్ర‌భావం గ‌ణ‌నీయంగా త‌గ్గుతూ ఉంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల విష‌యంలో ఇండియా ఆరు నెల‌ల క‌నిష్టాన్ని న‌మోదు చేసింది. దేశంలో మొత్తం క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌.. అధికారిక స‌మాచారం ప్ర‌కారం..మూడు ల‌క్ష‌లా తొమ్మిది వేల స్థాయిలో ఉంది. ఇది ఆరు నెల‌ల క‌నిష్టం. స‌రిగ్గా ఆరు నెల‌ల కింద‌ట ఇండియాలో యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల‌ను దాటింది. పెరుగుతూ వెళ్లింది ఆ నంబ‌ర్. ఒక ద‌శ‌లో ఆరు ల‌క్ష‌ల‌ను కూడా దాటింది. ఆ త‌ర్వాత రోజువారీ కేసుల సంఖ్య క్ర‌మంగా తగ్గ‌డంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌చ్చింది. ఇప్పుడు అది మూడు ల‌క్ష‌ల స్థాయికి చేరింది.

ఇది ఆరు నెల‌ల క‌నిష్ట స్థాయి. ఇక ఈ కేసుల్లో కూడా మెజారిటీ కేసులు కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మూడు ల‌క్ష‌ల యాక్టివ్ కేసుల్లో ల‌క్ష‌న్న‌ర కేసులు కేవ‌లం కేర‌ళ‌లోనే ఉన్నాయి! కేర‌ళ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు 1.6 లక్ష‌ల‌కు పైనే. ఇలా మొత్తం యాక్టివ్ కేసుల్లో యాభై శాతం పైగా కేసులు ఒక రాష్ట్రంలోనే ఉన్నాయి. మిగ‌తా దేశ‌మంతా క‌లిపి అన్ని యాక్టివ్ కేసులున్నాయి.

కేర‌ళ త‌ర్వాత మ‌హారాష్ట్ర ఎక్కువ స్థాయి యాక్టివ్ కేసుల‌ను క‌లిగి ఉంది. అక్క‌డ యాక్టివ్ కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 40 వేల‌కు పైగా ఉంది. ఇలా ఈ రెండు రాష్ట్రాలే అధిక కేసుల‌ను క‌లిగి ఉన్నాయి. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఏపీలు త‌లా 15 వేల స్థాయిలో యాక్టివ్ క‌రోనా కేసుల‌ను క‌లిగి ఉన్నాయి. ఇక ఉత్త‌రాది రాష్ట్రాలేమో త‌మ వ‌ద్ద క‌రోనా కేసులు లేవంటున్నాయి. చాలా రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య వంద లోపలే కావ‌డం గ‌మ‌నార్హం!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఎండెమిక్ స్టేజ్ లో ఉంద‌ని అంటున్నారు వైద్య నిపుణులు. దీని ఫ‌లితంగా భారీ ఎత్తున కేసులు రాక‌పోయినా.. స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కేసులు వ‌స్తుంటాయ‌ని వారు అంచ‌నా వేస్తున్నారు.