Begin typing your search above and press return to search.

రూ.20,870 కోట్లు మావి..రూ.46324 కోట్లు మీవి.. కానీ పేరు నాకే!

By:  Tupaki Desk   |   23 April 2021 11:30 AM GMT
రూ.20,870 కోట్లు మావి..రూ.46324 కోట్లు మీవి.. కానీ పేరు నాకే!
X
మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన పెద్దలందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని ఉచితంగా ఇవ్వాలా? లేక ఎంతైనా కొంత మొత్తం దీనికి వసూలు చేయాలా? అన్న దానిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.

అయితే దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు వేసేందుకు రూ.67193 కోట్లు ఖర్చు అవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. ఈ విలువ దేశ జీడీపీలో 0.36 శాతమేనని పేర్కొంది.

కరోనా రెండే వేవ్ దేశంలో ముసురుతున్న నేపథ్యంలో కేంద్రం అలెర్ట్ అయ్యింది. తాజాగా ఒక్కరోజులో దేశంలో 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 2వేలకు పైగా ప్రాణాలు పోతున్నాయి. దీంతో టీకా మూడో దశ కార్యక్రమాన్ని మే 1 నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో 18 ఏళ్లు నిండిన వారు టీకా తీసుకోవచ్చు.

ప్రస్తుతం దేశంలోని సుమారు 133.26 కోట్ల జనాభాలో టీకా వేసుకునేందుకు అర్హుల సంఖ్య 84.19 కోట్లకు చేరుతుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. వీళ్లందరికీ టీకా వేసేందుకు రూ.67193 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొంది. ఇది దేశ జీడీపీలో కేవలం 0.36శాతం మాత్రమేనని.. కేంద్రం దీన్ని భరించవచ్చని సూచించింది.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందులో రూ.20870 కోట్లు మాత్రమే భరిస్తామని తెలిపింది. ఇక మిగిలిన రూ.46324 కోట్లు రాష్ట్రాలు భరించాలని సూచించింది. మొత్తం టీకాల క్రెడిట్ మాత్రం కేంద్రం కొట్టేస్తూ .. నిధులు భరించడాన్ని మాత్రం రాష్ట్రాల నెత్తిన వేయడంపై ఆయా రాష్ట్రాల సీఎంలు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జీడీపీలో కేవలం 0.36శాతం గల 62103 కోట్లు కూడా ఖర్చు చేయకపోతే కేంద్రంలోని ప్రభుత్వం ఉండి ఎందుకని మేధావులు ప్రశ్నిస్తున్నారు.