Begin typing your search above and press return to search.

కరోనా టీకా డేటా లీక్, ఫార్మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్... నిజమెంత?

By:  Tupaki Desk   |   11 May 2022 3:30 PM GMT
కరోనా టీకా డేటా లీక్, ఫార్మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్... నిజమెంత?
X
చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎన్నో రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ల డోసులను ఇప్పటికే కోట్లాది మంది తీసుకున్నారు. ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించిన కీలకు డేటా లీక్ కావడంతో... అమెరికాకు చెందిన ఓ దిగ్గజ ఫార్మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ను అరెస్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన కీలక పత్రాలు విడుదలైన నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్ వైస్ ప్రెసిడెంట్ రాడీ జాన్సన్ ని అరెస్ట్ చేసినట్లు ఒక కథనం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియకుండానే చాలా మంది ఈ వార్తను షేర్ చేస్తూ... విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే అసలు ఈ వార్తలో నిజం ఎంత ఉంది... నిజంగానే ఆ కంపెనీకి సంబంధించిన కీలక పత్రాలు లీకయ్యాయా.. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ను నిజంగానే అరెస్ట్ చేశారా.. అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైజర్ వైస్ ప్రెసిడెంట్ రాడీ జాన్సన్ అరెస్ట్ బూటకమని తేలింది. వాస్తవానికి రాజీ జాన్సన్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదు. మోసం లేదా మరే ఇతర నేరం కింద ఆయనపై అభియోగాలను కూడా మోపలేదు. అంతర్జాతీయ మీడియా ఈ సంఘటనను నివేదించలేదు.

ఇది ఫే్ న్యూస్ అని కంపెనీయే నేరుగా ప్రకటించింది. అయితే వాంకోవర్ టైమ్స్ అనే వ్యంగ్య వైబ్ సైట్... ఈ కథనాన్ని ప్రచురించింది. కరోనా మహమ్మారి తర్వాత టీకా డ్రైవ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఫైజర్ సంస్థపై తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోంది.

అయితే ఫైజర్ సంస్థ సీఏఓ ఆల్బర్ట్ బౌర్లానే నేరుగా... కరోనా వ్యాక్సిన్ ల పని తీరు సరిగ్గా లేదని.. అందుకు సంబంధించిన డేటా లీక్ అయిందని... అందుకే ఫైజర్ వైస్ ప్రెసిడెంట్ రాడీ జాన్సన్ ని అరెస్ట్ చేశారంటూ తప్పుడు వార్తలను ప్రచురించినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అందుకే ఫైజర్ కంపెనీయే నేరుగా రంగంలోకి దిగి.. ఇదంతా అవాస్తవం అని ప్రకటించింది.

అంతే కాకుండా అసలు తప్పుడు వార్తలు ఎలా ప్రచురిస్తారంటూ ప్రశ్నించంది. చెప్పే వాళ్లు తప్పుగా చెప్పినా.. ప్రజలు ఎలా నమ్మతున్నారని వ్యాఖ్యానించింది. ఏది పడితే అది నమ్మకూడదని... పలు వార్తా సంస్తలు పూర్తిగా అవాస్తవాలు మాత్రమే రాస్తాయంటూ మండి పడింది. అలాంటి వార్త సంస్థలు ఇచ్చే ఏ వార్తను నమ్మకూడదని తెలిపింది.