Begin typing your search above and press return to search.
రష్యాలో జంతువులకు కరోనా వ్యాక్సిన్ !
By: Tupaki Desk | 28 May 2021 2:30 PM GMTప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి భయపెడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కేవలం మనుషులకే కాకుండా జంతువులకు కూడా సోకిన ఘటనలను మనం చూశాం. కొన్ని దేశాల్లోని జూలలో జంతువుల్లో కోవిడ్-19 వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. మనుషులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా జంతువులకి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
రష్యాలో జంతువులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. కార్నివాక్-కోవ్ పేరుతో డెవలప్ చేసిన వ్యాక్సిన్ ను రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ టీకాతో ఆరు నెలల వరకు జంతువులకు వైరస్ రాకుండా రక్షణ లభించనుంది. కార్నివాక్-కోవ్ వ్యాక్సిన్ ను కుక్కలు, పిల్లలు, నక్కలపై ప్రయోగించినట్లు రష్యా వెటర్నరీ విభాగం ప్రకటించింది. ఇది జంతువులపై ఎఫెక్టివ్ గా పని చేస్తోందన తెలిపింది. పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ ఇప్పించేందుకు జనం మొగ్గు చూపుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. కార్మివాక్-కోవ్ ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రారంభించినట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. రష్యా వెటర్నరీ విభాగం 17 వేల డోసులతో ఫస్ట్ విడత పంపిణీ ప్రారంభమైంది. ప్రస్తుతం వీటి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30 లక్షల డోసులుగా ఉందని, త్వరలోనే దాన్ని 50 లక్షలకు పెంచుతామని ప్రకటించింది రష్యా. ఇక , కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్ ను రష్యా తయారు చేసిన సంగతి తెలిసిందే. రష్యా తయారు చేసిన స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ కరోనాకు సమర్ధవంతంగా పనిచేస్తున్నది. దేశంలో కూడా ఈ వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.