Begin typing your search above and press return to search.
ఇండియా తొలి ఓటర్ కు కరోనా వ్యాక్సిన్ ..!
By: Tupaki Desk | 10 March 2021 6:30 AM GMTకరోనా వైరస్ .. ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి , ఏడాది కాలం ముగిసినా కూడా ఇంకా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి , చైనా ను ఎంతగా నాశనం చేసిందో కరెక్ట్ గా తెలియదు కానీ , మిగిలిన ప్రపంచాన్ని మాత్రం అతలాకుతలం చేసింది. ముఖ్యంగా అమెరికా వంటి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా మహమ్మారి దెబ్బకి వణికిపోయాయి. అయితే , కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తూ భారతదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన ప్రక్రియ ను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 3.20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మార్చి 1 వ తేదీ నుంచి 60 సంవత్సరాలు దాటిన వృద్దులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.
అయితే , ఈ కరోనా టీకా పై కొందరు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా పై ప్రజల్లో ఉన్న అపోహలని తొలగించడానికి భారత్ దేశపు తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ పై అనుమానాలు అర్థరహితమని స్పష్టం చేస్తూ ఆయన మంగళవారం కరోనా టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నూర్ జిల్లాకు చెందిన నేగి వయసు 103 ఏళ్లు. ఆయన భారత్‌దేశపు తొలి ఓటరే కాకుండా.. అందరికంటే సీనియర్ ఓటర్ కూడా.
శ్యామ్ నెగీ 1917 జులై 1న పుట్టారు . స్కూల్ ఉపాధ్యాయుడిగా చేసి పదవీ విరమణ చేశారు. స్వతంత్ర భారత దేశంలో 1951-52లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో నెగీ ఓటు వేశారు. అప్పటి నుంచి నేటి వరకూ జరిగిన ప్రతి పార్లమెంట్, శాసనసభ, స్థానికల్లో నెగీ ఓటు వేస్తూ వస్తున్నారు. తాను ఎలా దేశంలో తొలి ఓటర్ అయిందీ ఇప్పటికీ స్పష్టంగా గుర్తుందని అంటారు నెగీ. భారత దేశంలో తొలి ఎన్నికలు ఫిబ్రవరి 1952లో జరిగాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని మారుమూలన ఉన్న గిరిజన ప్రాంతాల్లో కాస్తంత ముందుగానే ఎన్నికలు జరిగాయి. చలికాలం కారణంగా వాతావరణం వల్ల ఆటంకం ఏర్పడుతుందేమోననే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఆయనకు ఎన్నికల విధులను అప్పగించింది. ఆ సందర్భంగా నెగీ చిని నియోజకవర్గంలో తొలిసారిగా ఓటు వేశారు.
టీకా తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజలందరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని కోరారు. కుటుంబసభ్యులతో పాటు వ్యాక్సినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆయనకు డాక్టర్లు టీకా వేసి, అరగంట పాటు ఆయన ఆరోగ్యం తీరుతెన్నులను పరిశీలించారు. ఆ తర్వాత నేగి ని ఇంటికి పంపించారు.