Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ వారికేనా .. మా పరిస్థితి ఏంటి ?
By: Tupaki Desk | 4 May 2021 1:30 PM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజూ కూడా లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే వేలకొద్ది మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దీ నితో కరోనా ను అడ్డుకోవాలంటే వేగంగా వ్యాక్సిన్ ను అందరికి ఇవ్వడమే ముందున్న లక్ష్యం. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ ను వేగవంతం చేశారు. అయితే , వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఇదే ఇప్పుడు కొందరికి శాపంగా మారింది. ఆన్లైన్ లో బుక్ చేస్తే కానీ టీకా ఇవ్వడం కుదరదు అని ప్రభుత్వం చెప్తుంటే .. ఆన్లైన్ లో ఎలా బుక్ చేయాలో తెలియని నిరక్షరాస్యులు మాత్రం చదువుకున్న వారికీ మాత్రమేనా టీకాలు మాకు లేదా అని వాపోతున్నారు.
కరోనా వ్యాక్సిన్ చదువుకున్న వాళ్లకేనా, మాకు చదువు రాదు.. ఎవరిని అడగాలి, కంప్యూటర్‌లో బుక్ చేసుకుని రావాలట, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. కరోనాతో మా ప్రాణాలు పోవాల్సిందేనా’ అని ఇద్దరు మహిళలు సోమవారం ఉప్పల్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వద్ద దిక్కుతోచని స్థితిలో నిల్చున్నారు. చెట్టుకింద దిగాలుగా కూర్చిండి పోయారు. మేము కూడా కరోనా వైరస్ వాక్సిన్ కోసం వచ్చామని.. అదేదో బుక్ చేసుకుంటేనే వేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులు వాక్సినేషన్‌కు విరామం ఇచ్చిన అధికారులు కొవిన్ యాప్‌లో బుక్ చేసుకోవాలని నిబంధన విధించారు. విషయం తెలియక చాలా మంది సోమవారం ఉదయమే ఆస్పత్రుల వద్ద బారులు తీరారు. అయితే, అక్కడి సిబ్బంది 45 సంవత్సరాలు దాటి, కొవిన్ యాప్ లో బుక్ చేసుకున్న వారు మాత్రమే ఉండాలని చెప్పడంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. దీనితో మాలాంటి వారికి ప్రభుత్వం ఏదైనా మరో మార్గం చూపించాలని కోరుతున్నారు.