Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్​.. సొరచేపల చావుకొచ్చింది!

By:  Tupaki Desk   |   1 Oct 2020 9:30 AM GMT
కరోనా వ్యాక్సిన్​..  సొరచేపల చావుకొచ్చింది!
X
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఓ భయానక స్థితిలోకి నెట్టివేసింది. ఈ వైరస్​ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఉపాధి కోల్పోయారు. పనులు దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్యకు లెక్కేలేదు. అయితే ఈ భయానక కరోనా పీడను వదిలించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్​ కనిపెట్టి ప్రపంచానికి కరోనా జాడ్యాన్ని వదిలించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్​ తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు పనిచేస్తాయి. అయితే ఇదే సందర్భంలో ఓ నిజం బయటపడింది.

అదేమిటంటే.. కరోనా వ్యాక్సిన్ తయారు చేయాలంటే శాస్త్రవేత్తలు కొన్ని లక్షల సొరచేపలు (షార్క్​) చంపాల్సి ఉంటుంది. వాటి కాలేయ నూనెలో ఉండే సహజ సేంద్రియ సమ్మెళనం (స్క్వాలెన్) ద్వారా ఆధారంగానే మెజార్జీ కంపెనీలు వ్యాక్సిన్​ను తయారు చేస్తున్నట్టు సమాచారం. స్క్వాలెన్ మనిషి రోగనిరోధకశక్తిని పెంచుతున్నదని సమాచారం. డబ్ల్యూహెచ్‌ఓ, రెగ్యులేటరీ అఫైర్స్ ప్రొఫెషనల్స్ సొసైటీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మెజారిటీ వ్యాక్సినల్లో ఈ స్క్వాలెన్​ వాడుతున్నట్టు సమాచారం. ఈ స్క్వాలెన్ కోసం లక్షల సొరచేపలను అంతమొందించక తప్పదు. ఒక వేళ వ్యాక్సిన్​ రెండు డోసులు వేయాల్సి వస్తే దాదాపు 5 లక్షల సొరచేపలను చంపాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటికే సౌందర్య లేపనాల తయారీలో స్క్వాలెన్ ను విస్త్రృతంగా వాడుతున్నారు. అయితే స్క్వాలెన్ కోసం సొరచేపలను చంపడం ద్వారా వాటి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని జంతుప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

స్క్వాలెన్ కోసం సొరచేపలను ఆశ్రయించకుండా మొక్కలమీద ఆధారపడాలని వారు సూచిస్తున్నారు. బ్రిటన్​, భారత్ కు చెందిన కంపెనీలు స్క్వాలెన్ మీద ఆధారపడ్డాయి. ఈ పదార్థాన్ని కృత్రిమంగా తయారు చేయడం కష్టం కనుక సొరచేపలను చంపక తప్పని పరిస్థితి నెలకొన్నది.