Begin typing your search above and press return to search.

గ‌ర్భిణుల‌కు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే: ఐసీఎంఆర్‌

By:  Tupaki Desk   |   26 Jun 2021 3:30 PM GMT
గ‌ర్భిణుల‌కు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే: ఐసీఎంఆర్‌
X
దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 18 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అలాగే , 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి టీకా ఇచ్చేందుకు ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ ను గ‌ర్భిణుల‌కు ఇవ్వ‌వ‌చ్చు అని కేంద్ర ఆరోగ్య‌శాఖ త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో సూచించింద‌ని వెల్లడించింది. గర్భిని స్త్రీలకు కూడా ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ తెలిపారు. సార్స్ సీవోవీ2 వేరియంట్లు అయిన ఆల్పా, బీటా, గామా, డెల్టాల‌పై కోవీషీల్డ్‌, కోవాక్సిన్ టీకాలు ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఒకే ఒక దేశం పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇస్తున్న‌ట్లు ఐసీఎంఆర్ చీఫ్ తెలిపారు.

అయితే మ‌రి చిన్న పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ అవ‌స‌రమా అన్న‌ది ఇంకా తెలియ‌ని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింద‌న్నారు. వ్యాక్సిన్ గురించి పూర్తిగా వివరాలు తెలిసే వరకు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌లేమ‌ని బ‌ల‌రామ్ భార్గ‌వ్ తెలిపారు. ఆ విషయంపై ఇప్పటికే స్ట‌డీ కూడా చేప‌డుతున్నట్లు చెప్పారు. 2 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు పిల్ల‌ల్లో ప‌రీక్షిస్తున్న‌ట్లు తెలిపారు. వాటి ఫ‌లితాలు సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ‌స్తాయ‌న్నారు. కాగా , 12 దేశాల్లో డెల్టాప్ల‌స్ కేసులు ఉన్న‌ట్లు తెలిపారు. ఇండియాలో 50 కేసుల‌ను గుర్తించిన‌ట్లు తెలిపారు. డెల్టా ప్ల‌స్ వైర‌స్‌ ను ఐసోలేట్ చేసి క‌ల్చ‌ర్ చేస్తున్నామ‌ని, మిగితా వేరియంట్ల‌కు చేసిన ప‌రీక్ష‌ల‌నే చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ల్యాబ్‌ లల్లో వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌త‌ను ప‌రీక్షిస్తున్నామ‌ని, మ‌రో ప‌ది రోజుల్లో ఫ‌లితాలు వస్తాయని బ‌ల‌రామ్ భార్గ‌వ తెలిపారు. పిల్ల‌ల వ్యాక్సినేష‌న్‌పై అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, వారికి వ్యాక్సిన్ ఇవ్వాలా వ‌ద్దా అన్న కోణంలో సంప్ర‌దింపులు కొన‌సాగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో డెల్టా పాజిటివ్ వ‌చ్చిన ఇద్ద‌రు మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్లడించింది.