Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ః అపోహలు ఇవీ.. నిజాలు అవీ!

By:  Tupaki Desk   |   13 April 2021 7:33 AM GMT
కరోనా వ్యాక్సిన్ః అపోహలు ఇవీ.. నిజాలు అవీ!
X
వ్యాక్సిన్ వంద‌శాతం సుర‌క్షిత‌మ‌ని తేల‌లేద‌ని, అది తీసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయ‌ని.. ఇలా ఎన్నో ర‌కాల భ‌యాలు ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. దీంతో.. చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవ‌డాని‌కి ముందుకు రావ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో నిపుణులు చెబుతున్న అపోహ‌లు-నిజాల గురించి అంద‌రూ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

అపోహః కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌డం ద్వారా డీఎన్ఏ పై ప్ర‌భావం ప‌డుతుంద‌నే భ‌యం చాలా మందిలో ఉంది.
వాస్త‌వంః డీఎన్ఏను ప్ర‌భావితం చేసే శ‌క్తి వ్యాక్సిన్ కు లేదు. క‌ణాల్లోని న్యూక్లియ‌స్ లోకి వెళ్లి డీఎన్ఏ ను మార్చ‌లేద‌ని చెబుతున్నారు.

అపోహః క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స‌రిగా జ‌ర‌గలేదు కాబ‌ట్టి. వ్యాక్సిన్ ను న‌మ్మ‌లేమ‌ని కూడా చాలా మంది అంటున్నారు.
వాస్త‌వంః అన్ని ర‌కాల ట్ర‌య‌ల్స్ లో విజ‌య‌వంతం అయిన త‌ర్వాత‌నే వ్యాక్సిన్ కు అనుమ‌తులు ఇచ్చారు. కాబ‌ట్టి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

అపోహః క‌రోనా సోకి త‌గ్గిన వారికి వ్యాక్సిన్ అవ‌స‌రం లేదనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.
వాస్త‌వంః క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారు కూడా త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవ‌డం ద్వారానే శ‌రీరంలో యాంటీ బాడీస్ పూర్తిస్థాయిలో డెవ‌ల‌ప్ అవుతాయి.

అపోహః అల‌ర్జీలు ఉన్న‌వారు, ఇమ్యునిటీ త‌క్కువ‌గా ఉన్న‌వారు, గ‌ర్భిణులు, బాలింత‌లు వ్యాక్సిన్ తీసుకోవ‌ద్ద‌నే ప్ర‌చారం కూడా ఉంది.
వాస్త‌వంః అంద‌రూ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వని నిపుణులు చెబుతున్నారు.

అపోహః వ్యాక్సిన్ తీసుకున్నాం కాబ‌ట్టి ఇక భ‌యం లేదు అని చాలా మంది భావిస్తున్నారు.
వాస్త‌వంః వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మాస్క్ ధ‌రించడం.. శానిటైజ్ చేసుకోవ‌డం కంప‌ల్స‌రీ.