Begin typing your search above and press return to search.
ముక్కు - నోటి ద్వారా కరోనా వ్యాక్సిన్!
By: Tupaki Desk | 13 Oct 2020 7:00 AM ISTకరోనా వైరస్‌ను అంతం చేయడం కోసం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు కీలక హ్యుమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ లలో మూడో దశ వ్యాక్సిన్‌లను విన్నూతంగా రూపొందిస్తున్నారు. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ ముక్కు, నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులతో పాటు, రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తోంది. దీంతో చాలా సందర్భాలలో మనుషులు శ్వాస ఆడక మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేరుగా ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ వ్యాక్సిన్ అందించగలిగితే ఎలా ఉంటుందనే దానిపై సైంటిస్ట్‌లు దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇప్పటికే అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ వైద్యులు ఈ తరహా ప్రయోగాలు చేశారు. ఇక ఈ పరీక్షలలో విజయవంతమైన ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం కోసం పరిశోధకులు కరోనా వైరస్ దాడి చేసేందుకు ఉపయోగించే వైరస్ స్పైక్ ప్రొటీన్ ను జలుబుకు కారణమయ్యే అడినో వైరస్ లోకి జొప్పించారు. హానికరం కాని ఈ అడినో వైరస్, స్పైక్ ప్రొటీన్‌ను ముక్కు ద్వారా తీసుకెళ్లి కరోనా వైరస్ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తోందని గుర్తించారు. ఎలుకల్లో నాసల్ డ్రాప్స్, ఇంజెక్షన్ రూపంలో ఈ వ్యాక్సిన్ ఇవ్వగా ఇంజెక్షన్ న్యుమోనియాను నిరోధించింది కానీ ముక్కు, ఊపిరితితుల్లో ఇన్ఫెక్షన్‌ను నిరోధించలేకపోయింది. కానీ ముక్కు ద్వారా ఇచ్చిన వ్యాక్సిన్ మాత్రం సమర్థవంతంగా పని చేసినట్లు గుర్తించారు.
దీని గురించి అలబామా యూనివర్శిటీ నిపుణులు మాట్లాడుతూ, మిగిలిన వ్యాక్సిన్ల కంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఎక్కువ ఫలితాన్ని అందిస్తోంది. అయితే ఇది ఇంకా అందుబాటులోకి రాలేదని, ఒకవేళ వస్తే మాత్రం ఇది తప్పకుండా మంచి ఫలితాల్ని ఇస్తుందని తెలిపారు.