Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్లు.. ఎప్పుడు - ఎలా - ఎవరికి ఇవ్వబోతున్నారంటే..

By:  Tupaki Desk   |   4 Jan 2021 5:30 PM GMT
కరోనా వ్యాక్సిన్లు.. ఎప్పుడు - ఎలా - ఎవరికి ఇవ్వబోతున్నారంటే..
X
మనదేశంలో కరోనా వ్యాక్సిన్లకు అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీతో కలిసి సీరం ఇన్​స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్​ వ్యాక్సిన్​కు.. భారత్​ బయోటెక్​ రూపొందించిన కోవాక్జిన్​కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. అయితే ఈ వ్యాక్సిన్లు ఏ వయసువారికి ఇవ్వబోతున్నారు.. ఎలా ఇవ్వబోతున్నారు.. తదితర అంశాలపై డీసీజీఐ క్లారిటీ ఇచ్చింది. అయితే కోవాక్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి కాకుండానే అనుమతులు ఎలా ఇచ్చారంటూ పలువురు నిపుణులు ప్రశ్నించారు. దీంతో ఈ విమర్శలపై కూడా డీసీజీఐ క్లారిటీ ఇచ్చేసింది.

వ్యాక్సిన్లపై మరో కీలక అంశాన్ని డీసీజీఐ ప్రకటించింది. భారత్​ బయోటెక్​ తయారుచేసిన కోవాగ్జిన్​కు కేవలం 12 ఏళ్లు నిండిని వారికి మాత్రమే వేయనున్నారు. మరోవైపు కోవిషీల్డ్​ను 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఇవ్వాలని డీసీజీఐ సూచించింది.
అయితే ఈ రెండు వ్యాక్సిన్లను రెండు డోసుల్లో ఇవ్వనున్నారు. మూడోదశ ట్రయల్స్​ పూర్తికాకుండానే కోవాక్జిన్​కు ఎలా అనుమతించారంటూ పలువురు ప్రశ్నించారు.

అయితే ఈ విషయంపై డ్రగ్ కంట్రోలర్​ అధికారులు మాట్లాడుతూ.. కోవాక్జిన్​ను భద్రతపై ఎవరికీ అనుమానం అక్కర్లేదని.. ఈ వ్యాక్సిన్​ రోగనిరోధకశక్తిని పెంచుతుందని తెలిశాక వ్యాక్సిన్​ అనుమతి ఇచ్చామని.. ఈ వ్యాక్సిన్​ భద్రతపై 110 శాతం గ్యారంటి ఇవ్వగలమని అధికారులు చెప్పారు. మరోవైపు కోవిషీల్డ్​ వ్యాక్సిన్​పై సీరం సీఈవో అదర్​ పూనావాలా మాట్లాడుతూ.. కోవిషీల్డ్​ 100 మిలియన్​ డోసులను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు. ఈ టీకాను రూ. 200 లకు ప్రభుత్వానికి.. రూ. 1000కి ప్రైవేట్​ వ్యక్తులకు విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు.