Begin typing your search above and press return to search.
మహిళా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ కి హాజరైన కరోనా బాధితుడు !
By: Tupaki Desk | 12 March 2020 12:29 PM GMTఇటీవలే మహిళా టి20 వరల్డ్ కప్ పోరు ముగిసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగగా, 85 పరుగుల తేడాతో గెలుపొందిన ఆతిథ్య ఆస్ట్రేలియాజట్టు ఐదోసారి టైటిల్‌ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కి రికార్డ్ స్థాయిలో 86,174 మంది అభిమానులు హాజరైయ్యారు. ఒక మహిళల గేమ్ కి ఈ లెవెల్ లో అభిమానులు హాజరుకావడం అనేది మొదటిసారి కావడం విశేషం.
అయితే.. తాజాగా స్టేడియంలోని లెవల్ 2 నార్త్ స్టాండ్ లోని సెక్షన్ 42లో కూర్చున్న ఒక అభిమానికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలడం తో , ఆ మ్యాచ్ కి హాజరైన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనితో ఆ స్టాండ్‌లో కూర్చున్న వారు భయపడాల్సిన అవసరం లేదు అని , కొంచెం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు చూచించారు. అలాగే ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని ఆదేశించారు.
ఇకపోతే , ఈ కరోనా దెబ్బకి ఫుట్ బాల్ టోర్నీలు ప్రేక్షకులు లేకుండానే కొనసాగుతున్నాయి. అలాగే పలు టోర్నీలని నిర్వాహకులు వాయిదా వేసుకుంటున్నారు. ఇక ఈ కరోనా భారత్ లో జూలు విదుల్చుతుంది. ఇప్పటికే 73 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో త్వరలో ప్రారంభమైయ్యే వరల్డ్ రీచ్ లీగ్ ఐపీఎల్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2020 ని రద్దు చేయాలంటూ ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. దీనిపై నేడు కేంద్రం ఒక నిర్ణయం తీసుకోనుంది.