Begin typing your search above and press return to search.

ఆ దేశాల్లో సిట్చువేష‌న్ అలా ఎలా మారింది?

By:  Tupaki Desk   |   30 April 2020 2:30 AM GMT
ఆ దేశాల్లో సిట్చువేష‌న్ అలా ఎలా మారింది?
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించిన క‌రోనా వైర‌స్‌తో దాదాపు అన్ని దేశాలు తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌య్యాయి. ఈ వైర‌స్‌పై నిర్ల‌క్ష్యం చేసిన దేశాలు తీవ్రంగా న‌ష్ట‌పోతుండ‌గా.. ముందే అప్ర‌మ‌త్త‌మైన దేశాల్లో ఇప్పుడు సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకున్న చ‌ర్య‌లు ప‌లు దేశాల్లో విజ‌య‌వంత‌మ‌య్యాయి. ఫ‌లితంగా ఆయా దేశాల్లో సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డుతుండ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. అయితే ప్ర‌స్తుతం క‌రోనా క‌ట్ట‌డిలో నాలుగు దేశాలు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుని ఆ మ‌హ‌మ్మారిపై పోరు చేసి గెలుస్తున్నారు. ఇప్పుడు ఆ వైర‌స్ నుంచి కోలుకుని క‌రోనా ఫ్రీ దేశాలుగా ఆవిర్భ‌వించ‌నున్నాయి. ఆ దేశాలే న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా - చైనా - ఫ్రాన్స్‌. న్యూజిలాండ్‌ లో ఒక్క కొత్త కేసు కూడా న‌మోదు కావ‌డం లేదు. మిగ‌తా దేశాల్లో ప‌దిలోపు మాత్ర‌మే న‌మోద‌వుతున్నాయి. దీంతో క‌రోనా విజృంభ‌ణ ఆగిపోయింది.

ముఖ్యంగా న్యూజిలాండ్‌లో కేసులు నమోదు పూర్తిగా తగ్గిపోయింది. ఆ దేశంలో ఒక్క‌రోజులో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఆస్ట్రేలియాలో కూడా క‌రోనాపై యుద్ధం చేసి స‌త్ఫ‌లితాలు సాధించారు. కరోనా ఫ్రీ అయ్యే అవ‌కాశం త్వ‌ర‌లోనే ఉంది. ఆ దేశంలో 24 గంటల్లో 11 కేసులు మాత్రమే న‌మోద‌య్యాయి. ఈ విధంగా ప‌దిలోపు మాత్ర‌మే కేసులు న‌మోద‌వుతుండ‌డం చూస్తుంటే ఆ దేశంలో క‌రోనా కంట్రోల్‌లోకి వ‌చ్చిన‌ట్టే.

మొద‌ట క‌రోనా వైర‌స్ పుట్టి పెరిగి విజృంభించినది చైనాలోనే. ఆ దేశం దాదాపు ఆరు నెల‌ల పాటు క‌రోనాతో యుద్ధం చేసింది. బ‌య‌టి దేశాలు త‌మ‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు చేసినా.. ఈ వైర‌స్‌ను మాత్రం అరిక‌ట్ట‌డంలో తీవ్రంగానే కృషి చేసింది. ఈ క్ర‌మంలో ఒక్క‌రోజులో ఆ దేశంలో 6 కొత్త కేసులు మాత్రమే వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ప‌రిస్థితులు అదుపులోకి రావ‌డంతో వైరస్ పుట్టిన వూహాన్ నగరాన్ని పూర్తిగా తెరిచారు. ఈ విధంగా చైనాలో పూర్వ స్థితి రాబోతోంది.

అమెరికా క‌న్నా ముందు వైర‌స్ ధాటికి ఫ్రాన్స్ గ‌జ‌గ‌జ వ‌ణికిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ దేశాలో కూడా ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చిన‌ట్టు ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. కేసులు న‌మోద‌వుతున్నా పాఠశాలలు తెరిచేందుకు ఫ్రాన్స్ నిర్ణ‌యించింది. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని లాక్‌ డౌన్‌ ను స‌క్ర‌మంగా అమలు చేయడం లేదు. సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డేలా అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో కొంత ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఈ విధంగా క‌రోనా నుంచి ఈ నాలుగు దేశాలు కొంత పైచేయి సాధించాయ‌ని తెలుస్తోంది. కొన్ని రోజుల త‌ర్వాత అక్క‌డ పూర్వ స్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంది.